జాలీ ఎల్‌ఎల్‌బీ 3 ఓటీటీ రిలీజ్, అక్షయ్ కుమార్ సినిమా ఎక్కడ చూడాలి, బాక్సాఫీస్ రిపోర్ట్ సంగతేంటి?

Published : Nov 14, 2025, 01:35 PM IST

అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీ నటించిన కోర్ట్ రూమ్ డ్రామా 'జాలీ ఎల్‌ఎల్‌బీ 3' ఓటీటీలోకి వచ్చేసింది. సుభాష్ కపూర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2025 సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదలైంది. విమర్శకులు, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

PREV
15
జాలీ ఎల్‌ఎల్‌బీ 3 స్టార్ కాస్ట్

'జాలీ ఎల్‌ఎల్‌బీ 3' లీగల్ కామెడీ డ్రామాలో అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీతో పాటు సౌరభ్ శుక్లా, అమృతా రావ్, హుమా ఖురేషి, సీమా బిస్వాస్, గజరాజ్ రావ్, రామ్ కపూర్, శిల్పా శుక్లా, బ్రిజేంద్ర కాలా లాంటి నటులు ముఖ్య పాత్రలు పోషించారు.

25
భారత్‌లో జాలీ ఎల్‌ఎల్‌బీ 3 కలెక్షన్లు

'జాలీ ఎల్‌ఎల్‌బీ 3' ఇండియాలో మొదటి రోజు రూ.12.5 కోట్లు, మొదటి వారం రూ.74 కోట్లు వసూలు చేసింది. మొత్తం 8 వారాల్లో ఇండియాలో రూ.117.56 కోట్లు సంపాదించింది. ఇండియాలో ఈసినిమా కలెక్షన్లు ఒక రకంగా నిరాశపరిచాయనే చెప్పాలి. 

35
ప్రపంచవ్యాప్తంగా జాలీ ఎల్‌ఎల్‌బీ 3 కలెక్షన్లు

ప్రపంచవ్యాప్త బాక్సాఫీస్ గ్రాస్ కలెక్షన్ల విషయానికొస్తే, జాలీ ఎల్‌ఎల్‌బీ 3 రూ.170.22 కోట్లు సంపాదించింది. ఇందులో ఓవర్సీస్ నుంచి రూ.31.50 కోట్లు వచ్చాయి. ఇండియాలో సినిమా గ్రాస్ కలెక్షన్ రూ.138.72 కోట్లుగా ఉంది.

45
Jolly LLB 3 బాక్సాఫీస్ రిజల్ట్ ?

'జాలీ ఎల్‌ఎల్‌బీ 3' బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించేలకపోయింది.  రూ.120 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా, ఇండియాలో రూ.117.56 కోట్లు మాత్రమే వసూలు చేసి ఫ్లాప్ అయింది. 

55
ఓటీటీలో జాలీ ఎల్‌ఎల్‌బీ 3 ఎక్కడ చూడాలి?

'జాలీ ఎల్‌ఎల్‌బీ 3' సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ మొదలైంది. ప్రేక్షకులు ఇక్కడ సినిమాను ఎంజాయ్ చేయొచ్చు. కొన్ని రిపోర్టుల ప్రకారం, ఈ సినిమా జియో హాట్‌స్టార్‌లో కూడా స్ట్రీమ్ అవుతోందని అంటున్నారు. కానీ, అధికారికంగా నెట్‌ఫ్లిక్స్ మాత్రమే ధృవీకరించింది.

Read more Photos on
click me!

Recommended Stories