Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganaledu) సీరియల్ మంచి పరువుగల కుటుంబ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 10 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
ఇక రామచంద్ర (Rama Chandra) చకచకా వంట పూర్తి చేస్తూ ఉండగా జ్ఞానాంబ (Jnanamba) దంపతులు, జానకి పక్క పక్కన కూర్చొని చూస్తూ ఉంటారు. ఇక కాంపిటీషన్లో వంటలను స్వయంగా వారిని సేల్ చేయమని అంటారు. ఎవరు ఎక్కువగా చేస్తారు వాళ్ళు గెలిచినట్లు అని చెబుతారు.
26
ఇక మీరు తయారు చేసిన వంటను టూరిస్ట్ వాళ్లకు ఎవరైతే ఎక్కువగా సేల్ చేస్తారో.. వాళ్లు నెక్స్ట్ రౌండ్ కి ఎంపిక అయినట్లు అని అచెబుతారు. ఇక టూరిస్టులు వచ్చి.. రామచంద్ర (Rama Chandra) చేసిన మొక్కజొన్నపాయసం కొనడానికి ఆలోచిస్తూ ఉంటారు.. ఇక జ్ఞానాంబ (Jnanamba) దంపతులు టెన్షన్ పడుతూ ఉంటారు.
36
ఇక రామచంద్ర (Rama Chandra) చేసిన వంటకాన్ని టూరిస్టు అందరూ ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. అది గమనించిన జ్ఞానాంబ (Jnanamba) దంపతులు ఇలా జరుగుతుంది ఏమిటి? అని టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక జడ్జీలు కూడా రామచంద్ర స్టాల్ లో ఎవరూ వెళ్లడం లేదని గమనిస్తూ ఉంటారు. ఆ మాటలు విన్న జానకి టెన్షన్ పడుతూ ఉంటుంది.
46
ఇక రామచంద్ర (Rama Chandra) తయారుచేసిన స్వీట్ ఫ్రీగా ఇస్తా అన్న గాని.. ఎవరు తీసుకోరు. అది గమనించిన జ్ఞానాంబ గుండె తరుక్కుపోతుంది. ఇక చివరికి రామచంద్ర దగ్గరికి చిన్నబాబు వచ్చి ఆ పాయసాన్ని తాగుతాడు. ఇక ఆ పిల్లవాడి తల్లిదండ్రులు ఏది పడితే అది తాగుతావా అంటూ.. ఆ పాయసాన్ని విసిరి కొడతారు. ఇక జ్ఞానాంబ (Jnanaamba) బాధపడుతుంది.
56
ఇక రామచంద్ర (Rama Chandra) వారి మీద ఏ మాత్రం కోపం పడకుండా ఆ స్వీట్ లో ఉన్న ఔషధ గుణాల గురించి వివరిస్తాడు. దాంతో ఆ తల్లి ముందుగా నాకు కొంచెం పోయండి అని అంటుంది. ఇక ఆ ఫ్యామిలీ మొత్తం ఆ స్వీట్ ను తాగుతారు. అది గమనించిన జ్ఞానాంబ (Jnanamba) దంపతులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తారు.
66
ఇక రామచంద్ర (Rama Chandra) చేసిన పాయసం నచ్చి ఆ దంపతులు 500 రూపాయలు ఇస్తారు. రామచంద్ర ₹100 సరిపోతాయి అనగా.. నీ చేతికి ఎంత ఇచ్చినా తక్కువే అన్నట్లుగా మాట్లాడుతారు. అది గమనించిన గోవిందరాజు (Govindaraju) దంపతులు ఎంతో సంతోష పడుతూ ఉంటారు. ఒక వైపు నుంచి జానకి కూడా ఒక్క సారిగా ఊపిరి పీల్చు కున్నట్టుగా అవుతుంది.