Shahrukh:నయనతార పెళ్ళికి హాజరు కావడంతో షారుఖ్ ఖాన్ పై దారుణంగా ట్రోలింగ్.. కారణం ఏంటో తెలుసా..

Published : Jun 10, 2022, 09:26 AM ISTUpdated : Jun 10, 2022, 09:27 AM IST

తన కోస్టార్ వివాహానికి షారుఖ్ సూపర్ స్టైలిష్ గా రెడీ అయి వచ్చారు. నయనతార వివాహానికి హాజరు కావడంపై షారుఖ్ ఖాన్ దారుణంగా ట్రోలింగ్ కి గురవుతున్నారు.

PREV
16
Shahrukh:నయనతార పెళ్ళికి హాజరు కావడంతో షారుఖ్ ఖాన్ పై దారుణంగా ట్రోలింగ్.. కారణం ఏంటో తెలుసా..

వన్నె తరగని సౌందర్యవతి నయనతార ,యువ దర్శకుడు విగ్నేష్ ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గురువారం రోజు మహాబలిపురం అంగరంగ వైభవంగా జరిగిన వివాహ మహోత్సవంలో వేదమంత్రాల సాక్షిగా, కుటుంబ సభ్యులు, అతిథులు, స్నేహితుల సమక్షంలో నయన్, విగ్నేష్ భార్య భర్తలయ్యారు. 

26

వీరిద్దరి వివాహానికి తారలు తరలివచ్చారు. రజనీకాంత్, షారుఖ్ లాంటి స్టార్ సెలెబ్రిటీలు హాజరయ్యారు. రజనీకాంత్ తో నయనతార చంద్రముఖి, దర్బార్, అన్నాత్తే లాంటి చిత్రాల్లో నటించింది. ఇక షారుఖ్ ఖాన్ తో  అట్లీ దర్శకత్వంలో 'జవాన్' చిత్రంలో నటిస్తోంది.

 

36

తన కోస్టార్ వివాహానికి షారుఖ్ సూపర్ స్టైలిష్ గా రెడీ అయి వచ్చారు. నయనతార వివాహానికి హాజరు కావడంపై షారుఖ్ ఖాన్ దారుణంగా ట్రోలింగ్ కి గురవుతున్నారు. అదేంటి.. నయనతార వివాహానికి అతిథిగా షారుఖ్ వస్తే తప్పేంటి అని డౌట్ రావచ్చు. కానీ నెటిజన్లు చేస్తున్న ట్రోలింగ్ కి కారణం ఉంది. 

46

ఇటీవల జరిగిన కరణ్ జోహార్ బర్త్ డే పార్టీకి షారుఖ్ హాజరయ్యారు. ఆ బర్త్ డే పార్టీలో దాదాపు 50 మంది గెస్ట్ లకు కోవిడ్ సోకింది. వారిలో షారుఖ్ కూడా ఉన్నారు. ఇటీవల షారుఖ్ పరీక్ష చేయించుకోగా చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. కోవిడ్ పాజిటివ్ అని తేలిన వారం రోజులకే షారుఖ్ ఇలా జనసందోహం ఉండే పెళ్లిళ్లకు హాజరు కావడం ఏంటి ఆంటూ నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. 

56

అది కూడా షారుఖ్ ముంబై నుంచి మహాబలిపురం కి ట్రావెల్ చేసి వెళ్లారు. నయనతార వివాహంలో వందలాది గెస్ట్ ల మధ్య ఉన్నారు. షారుఖ్ లాంటి బిగ్ సెలబ్రిటీ ఇలా బాధ్యత లేకుండా వ్యవహరించడం ఏంటి అంటూ నెటిజన్లు సూటిగా ప్రశ్నిస్తున్నారు. 

66

అయితే షారుఖ్ ఫ్యాన్స్ వాదన మరోలా ఉంది. షారుఖ్ కేవలం స్వల్ప లక్షణాలతో మాత్రమే బాధపడ్డారని.. అది చిన్నపాటి ఫ్లూ మాత్రమే అని అన్నారు. పూర్తిగా కోలుకున్నాక వైద్యుల క్లియరెన్స్ తోనే షారుఖ్ నయన్ వెడ్డింగ్ కి హాజరైనట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా నయనతార వెడ్డింగ్ లో షారుక్ ఫుల్ యాక్టివ్ గా, ఫిట్ నెస్ తో కనిపించారు. 

click me!

Recommended Stories