Janaki Kalaganaledu: తోటి కోడలిపై మల్లిక మరో కుట్ర.. ఏకంగా జానకి వాళ్ళ అన్నయ్యకు ఫోన్ చేసి!?

Published : Mar 29, 2022, 11:06 AM IST

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalagana ledu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. పరువు గల కుటుంబ నేపథ్యంలో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
17
Janaki Kalaganaledu: తోటి కోడలిపై మల్లిక మరో కుట్ర.. ఏకంగా జానకి వాళ్ళ అన్నయ్యకు ఫోన్ చేసి!?

రామచంద్ర (RamaChandra).. నాకు భార్యగా నీకు ఈ పరిస్థితి.. అటు కొడుకుగా మా అమ్మకు ఆ పరిస్థితి అని జానకితో చెబుతాడు. అంతేకాకుండా నేను ఓడిపోయాను అని చెబుతాడు. ఇక జ్ఞానాంబ (Jnanaamba) స్వీట్ షాప్ సెటర్ ఓపెన్ చేస్తూ ఉండగా అక్కడికి రామచంద్ర సహాయం చేయడానికి వస్తాడు.
 

27

ఇక జ్ఞానాంబ (Jnanaamba) రామచంద్రను ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ..  నానా రకాల మాటలు అంటుంది. అంతేకాకుండా ఈ ఇంటిని రెండు ముక్కలు చేసిన మీ భార్యకి ఈ కొట్టును రెండు మొక్కలు చేయడం కొత్తేమీ కాదు అని అంటుంది. దాంతో రామచంద్ర (Ramachandra) ఎంతో భాద పడతాడు.
 

37

జ్ఞానాంబ (Jnanaamba) ఈ స్వీట్ కొట్టు నాది దీని మీద ఎవరికీ ఎలాంటి హక్కులు లేవు అని అంటుంది. ఇక కార్ఖానాలో పని కోసం వెళ్లిన రామచంద్ర (Ramachandra) అక్కడ పని అడగడానికి సిగ్గు గా ఫీల్ అవుతాడు. ఆ కార్ఖానా వ్యక్తి కూడా బాబు మేము మీకు పని ఎలా ఇవ్వగలం అన్నట్టు మాట్లాడతాడు.
 

47

ఆ తర్వాత కార్ఖానా ఓనర్ జ్ఞానాంబ (Jnanaamba) కు ఫోన్ చేసి రామచంద్ర (Ramachandra) బాబు మా కార్ఖానా కు పని కోసం వచ్చారు అని చెబుతాడు. అంతేకాకుండా మీ అబ్బాయి గారికి పని ఇచ్చేంత స్థాయి నాది కాదు అని చెబుతాడు. దాంతో జ్ఞానాంబ ఆవేదన చెందుతుంది.

57

మరోవైపు రామచంద్ర (Ramachandra) ఎక్కడ పని దొరకలేదు అని జానకి తో చెప్తాడు. అంతేకాకుండా జ్ఞానాంబ గారి కొడుకు అంటే పని ఎవరూ ఇవ్వడం లేదని అంటాడు. మరో వైపు జ్ఞానాంబ (Jnanaamba) జానకి వల్లనే నా కొడుకు ఈ స్థాయికి వచ్చాడు అని అనుకుంటుంది.
 

67

మరోవైపు అమెరికా నుంచి జ్ఞానాంబ (Jnanaamba)  కుటుంబ సభ్యులకు అంతా పేరుపేరునా గిఫ్ట్ లు వస్తాయి. ఇక మల్లిక (Mallika) ఇదంతా జానకి ప్లాన్ అని పుల్లలు పెడుతుంది. దాంతో జ్ఞానాంబ ఆ గిఫ్ట్ లు రామచంద్ర ఇంటి ముందల పెట్టి నీలదీసి అడుగుతుంది.
 

77

మరోవైపు మల్లిక (Mallika) జానకి వాళ్ళ అన్నయ్య కు ఫోన్ చేసి ఆమె చాలా బాధలు పడుతుందని చెబుతుంది. అంతేకాకుండా త్వరగా వచ్చి తీసుకు వెళ్ళండి అని సానుభూతి తో నటిస్తూ చెబుతుంది. దాంతో జానకి (Janaki) వాళ్ళ బ్రదర్ ఎంతో బాధపడతాడు.

click me!

Recommended Stories