అవార్డుల ప్రధానం జరుగుతుండగా హోస్ట్ క్రిస్ రాక్ (Chris Rock)ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విల్ స్మిత్ వైఫ్ జడా పెంకెట్ స్మిత్ పై ఆయన జోక్స్ వేశారు. దీనితో ఆగ్రహానికి గురైన విల్ స్మిత్ నేరుగా వేదికపైకి వెళ్లి క్రిస్ రాక్ చెంప చెళ్లుమనిపించాడు. ఉత్తమ నటుడిగా ఆస్కార్ అందుకున్న విల్ స్మిత్.. అనంతరం వేదికపై అందరికీ క్షమాపణలు చెప్పారు. విల్ స్మిత్ (Will Smith)తోటి నటుడిపై చేయి చేసుకోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తున్నాయి. పబ్లిక్ లో ఓ సెలెబ్రిటీ టెంపర్ కోల్పోవడం చాలా అరుదు. అలా సహనం కోల్పోయి ఎవరైన స్టార్ ఇతరులపై చేయి చేసుకుంటే అది సెన్సేషన్ అవుతుంది. ఇండియాలో కూడా కొందరు స్టార్స్ తమ సహనటులు, సెలెబ్రిటీలు, ఫ్యాన్స్ పై వివిధ సందర్భాల్లో చేయి చేసుకున్నారు. వారెవరో ఆ సందర్భాలు ఏమిటో చూద్దాం...