Janaki Kalaganaledu: జానకి రామచంద్రలను పొగడ్తలతో ఆకాశానికెత్తేసిన మైరావతి.. ఆలోచనలో జ్ఞానంబ!

Navya G   | Asianet News
Published : Mar 22, 2022, 11:23 AM IST

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganaledu ) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఒక పరువు గల కుటుంబ నేపథ్యంలో ఈ సీరియల్ కొనసాగుతుంది. కాగా ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

PREV
16
Janaki Kalaganaledu: జానకి రామచంద్రలను పొగడ్తలతో ఆకాశానికెత్తేసిన మైరావతి.. ఆలోచనలో జ్ఞానంబ!

ఇన్ని రోజులు జానకి పై కసురుకున్న మైరావతి (Mairavathi) శబాష్ మనవరాలా అంటూ జానకి ను పోగొడుతుంది. దానికి జానకి (Janaki) ఎంతో ఆనందం వ్యక్తం చేస్తుంది. అదే క్రమంలో మైరావతి జానకి ను కౌగిలించుకుంటుంది. ఇక మరోవైపు జ్ఞానాంబ పిండి వంటలు వండుతూ ఉండగా మైరావతి తో సహా జానకి దంపతులు అక్కడికి వస్తారు.
 

26

దాంతో జ్ఞానాంబ (Jnanaamba ) కొంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది. ఇక ఇంటికి తీసుకువచ్చిన మైరావతి (Mairavathi) వీళ్ళిద్దరికీ పెద్ద శిక్ష వేస్తాను అని చెప్పి జానకి రామచంద్రల చేత పిండి వంటలు చేపిస్తుంది. మైరావతి.. మీ కొడుకును కోడలిని సంతోషంగా ఇంటికి తీసుకు వెళ్ళు అని అంటుంది. దాంతో జ్ఞానాంబ (Jnanaamba) ఎలా క్షమించమంటావు వీళ్లని అని అంటుంది.
 

36

అంతేకాకుండా వీళ్లు నన్ను నమ్మించి వెన్నుపోటు పొడిచారు అని జ్ఞానాంబ (Jnanaamba) వాపోతుంది. ఇక దానితో మైరావతి వాళ్లలా చేయకుంటే ఈ పాటికి నువ్వు మీ కూతురు శవం దగ్గర గుండె పగిలి ఏడ్చే దానివి అని అంటుంది. ఇక అలా మైరావతి (Mairavathi)  జరిగిన నిజాన్ని బయట పెడుతుంది.
 

46

ఇక అదే క్రమంలో మైరావతి (Mairavathi) మీ కోడలు నిజంగా దేవత అని చెబుతోంది. కాబట్టి గుర్తించి కళ్ళల్లో పెట్టుకుని చూసుకో లేదంటే నీ ఇష్టం అని చెబుతుంది. దాంతో జ్ఞానాంబ అక్కడినుంచి మౌనంగా వెళ్ళి పోతుంది. ఆ తర్వాత దిలీప్ వాళ్ళ ఫ్యామిలీ జ్ఞానాంబ (Jnanaamba ) గారు అంటూ గట్టిగా అరుచుకుంటూ వస్తారు.
 

56

అలా వచ్చిన దిలీప్ (Dilip) కుటుంబీకులు జానకి పై  వేరే స్థాయిలో జానకి చెప్పిన మాటలను దెప్పి పొడుచుకుంటూ విరుచుకు పడతారు. కానీ అసలు సంగతి ఏమిటో ఎవరికీ తెలియదు. కానీ జానకి (Janaki)  మాత్రం టెన్షన్ పడుతుంది. ఇక జ్ఞానాంబకు ఆ సమయంలో ఏమీ అర్థం కాదు.
 

66

ఇక తరువాయి భాగంలో జ్ఞానాంబ (Jnanaamba) ఒకచోట కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తుంది. జానకి ఒక వైపు ఉండి ఎంతో బాధతో ఏడుస్తుంది. మరోవైపు మల్లిక (Mallika )ఎంతో ఆనంద పడుతూ ఉంటుంది. ఇక ఏం జరిగిందో తెలుసుకోవాలంటే రేపటి వరకు వేచి చూడాల్సి ఉంది.

click me!

Recommended Stories