ఈరోజు ఎపిసోడ్ లక్షపత్రి పూజ చేసినందుకు చెయ్యి అంత నొప్పిగా ఉంది అని జ్ఞానాంబని తిట్టుకుంటూ ఉంటుంది మల్లిక. అఖిల్ అరెస్టు విషయాన్ని అడ్డుపెట్టుకొని జానకిని ఎలాగో అలా ఇరికించొచ్చు అనుకుంటే అఖిల్ ని బయటకు తీసుకుని వచ్చి జానకి మరిన్ని మార్కులు కొట్టేసింది అనుకుంటూ కుళ్లుకుంటూ ఉంటుంది మల్లిక. ఇంతలోనే అక్కడికి పనిమనిషి చికిత వస్తుంది. అప్పుడు చికిత మల్లిక మీద సెటైర్లు వేస్తూ ఉంటుంది. అయినా మీకు పదేపదే చేసిన ఫ్యామిలీ వేయడం బోర్ కొట్టడం లేదా అమ్మగారు అని అనగా నా ఇష్టమే నా ఇష్టం అని అంటుంది.