Janaki Kalaganaledu: అత్తను లెక్క చేయకుండా ముందడుగు వేసిన జానకి.. జ్ఞానాంబ ఫైర్!

Published : May 24, 2022, 10:43 AM IST

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganaledu) సీరియల్ మంచి పరువు గల కుటుంబం అని నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు మే 24 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

PREV
16
Janaki Kalaganaledu: అత్తను లెక్క చేయకుండా ముందడుగు వేసిన జానకి.. జ్ఞానాంబ ఫైర్!

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే జానకి (Janaki) రామచంద్ర (Ramachandra) ను పక్కకు తీసుకొని వచ్చి మనం అర్జెంట్ గా అప్లికేషన్ పూర్తి చేయడానికి వెళ్లాలి అని చెబుతుంది. వీరిద్దరు మాట్లాడుకునేది లీలావతి చాటుగా వింటుంది. ఇక జానకి సమస్యలన్నీ తీరాలంటే ఇంతకంటే గొప్ప అవకాశం ఉండదని చెబుతుంది.
 

26

ఇక ఇద్దరూ అప్లికేషన్ పూర్తి చేయడానికి బయలుదేరుతారు. అది గమనించిన నీలావతి (Neelavathi) ఈ విషయం జ్ఞానాంబ (Jnanaamba) కు చెప్పి నట్టింట్లో మంటను పెట్టాలి అని అనుకుంటుంది. ఇక వీళ్ళు ఇద్దరు దంపతులు లూసి ఉండే గెస్ట్ హౌస్ కి వెళ్లగా.. మేడం గారు ఇప్పటి వరకు  వెయిట్ చేసి.. ఇప్పుడే కార్లో వెళ్లి పోయారు అని చెబుతారు.
 

36

ఇక ఎలాగైనా జానకి (Janaki), రామచంద్రలు లూసి వెళ్లే కారును క్రాస్ చేస్తారు. రామచంద్ర (Rama Chandra) కాంపిటేషన్ అప్లికేషన్ ను పూర్తి చేస్తాడు. లూసీ మీరు తప్పకుండా కాంపిటేషన్ లో గెలుస్తారని ధైర్యం చెబుతుంది. మరోవైపు జ్ఞానాంబ ఆయుష్ పూజలో తన కొడుకు చివరి వరకు ఉండనందుకు కోపం వ్యక్తం చేస్తుంది.
 

46

ఈలోపు జానకి (Janaki) దంపతులు అక్కడికి వస్తారు. దాంతో జ్ఞానాంబ (Jnanaamba) నా కొడుక ప్రాణాలంటే నీకు లెక్కలేదా అని జానకి పై విరుచుకు పడుతుంది. ఆయుష్ పూజ విషయంలో రేపు ఉదయం వరకు గడప దాటకూడదు. నీకు నా మాటంటే లెక్కలేదా.. లేక నా కొడుకు అంటే లెక్కలేదా అని అంటుంది.
 

56

ఈ క్రమంలో మల్లిక (Mallika) మరింత పుల్లలు పెడుతుంది. ఇక నా కొడుకుని ఈ సమయంలో బయటికి తీసుకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది అని జానకి (Janaki) ని నిలదీసి అడుగుతుంది. దాంతో జానకి జరిగిన విషయం చెప్పి రామచంద్ర గారు ఆ పోటీల్లో ఎలాగైనా గెలుస్తారు అని చెబుతుంది.
 

66

నేను ఒకసారి వద్దని చెప్పిన తర్వాత అప్లికేషన్ పూర్తి చేసుకు రావడం ఏమిటి? అని జ్ఞానాంబ (Jnanaamba) అడుగుతుంది. అంతేకాకుండా ఇంకొకసారి ఈ వంటల పోటీ గురించి మాట్లాడిన.. నా దగ్గర ప్రస్తావించినా మర్యాదగా ఉండదు అని జానకి (Janaki) కి వార్నింగ్ ఇస్తుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.

click me!

Recommended Stories