అదే సమయంలో ఇంట్లో వాళ్ళందరూ కంగారుగా ఏమైంది అని వస్తారు. అప్పుడు జానకి, మల్లికకు జ్యూస్ కావాలట అత్తయ్య గారు అందుకే పిలుస్తుంది అని అనగా, జ్ఞానాంబ మల్లికను తిట్టి జ్యూస్ కావాలంటే ఇంట్లో చాలామంది ఉన్నారు కదా వెళ్లి అడుగు జానకి చదువు ఎందుకు పాడు చేస్తావు అని అంటారు. దానికి మల్లికా మాట్లాడబోతూ ఉండగా గోవిందరాజు కూడా మల్లిక నోరుని ఆపేసి అమ్మ లోపలికి వెళ్ళు అని అంటాడు. అప్పుడు అందరూ వెళ్ళిపోతారు. అప్పుడు జానకి, రామ వాళ్ళ గదిలో మాట్లాడుకుంటూ జానకి రామతో, నన్ను అడగకుండా మల్లిక దగ్గరికి ఎందుకు వెళ్లారు రామా గారు అని అంటుంది.