ఈ రోజు ఎపిసోడ్ లో సునంద తో పాటు కలిసి వచ్చిన ఒక ఆమె రెండో కోడలు మూడో కోడలు గర్భవతి అయితే మొదటి కోడలు పరిస్థితి ఏంటి అని అడుగుతుంది. అప్పుడు మల్లిక టాపిక్ డైవర్ట్ చెయ్ అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడు సునంద పాపం పెద్ద కోడలికి ఇంకా కడుపు పండలేదు. జ్ఞానాంబ కి రామా కొడుకుని ఎత్తుకోవాలని ఆరాటంగా ఉంది కానీ ఆ యోగం ఇవ్వద్దు అనడంతో వెంటనే మీరు అంత బాధ పడాల్సిన అవసరం లేదు సునంద గారు అంటూ అక్కడికి జానకి ఎంట్రీ ఇస్తుంది. మీరు వినాలనుకున్న శుభవార్త తొందరలోనే వింటారు అని అంటుంది జానకి. ఆ మాటలకు జ్ఞానాంబ వాళ్ళు సంతోష పడుతూ ఉంటారు.