Prema Entha Madhuram: అనుకు రాగసుధ ఫుటేజ్ చూపించాలనుకున్న మీరా.. కానీ అంతలోనే వారు రావడంతో?

Navya G   | Asianet News
Published : Feb 01, 2022, 09:19 AM IST

Prema Entha Madhuram: బుల్లితెరపై ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం (Prema Entha Madhuram) సీరియల్  ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి ప్రేమ కథ నేపథ్యంలో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

PREV
15
Prema Entha Madhuram: అనుకు రాగసుధ ఫుటేజ్ చూపించాలనుకున్న మీరా.. కానీ అంతలోనే వారు రావడంతో?

రాగ సుధ ఒక గుడిలో దండం పెట్టుకుంటూ ఉండగా  జిండే (Jinde) పంపిన వ్యక్తి కి కనపడుతుంది. ఆ వ్యక్తి వెంటనే జిండే కు కాల్ చేస్తాడు. జిండే రాగసుధ ను యాక్సిడెంట్ పేరుతో చంపేయ్ అంటాడు. ఈలోపు రాగసుధ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా కారు తో వెనకనుంచి ఆక్సిడెంట్ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈలోపు అనుకోకుండా రాగసుధ (Ragasudha) ను ఎవరో కాపాడుతారు.
 

25

ఆ తర్వాత మీరా (Meera ).. ఆ కాలుకు దెబ్బ ఏంటీ అని జిండే ను అడుగుతుంది. దానికి జిండే చెప్పకపోగా అసలు నిన్న ఆఫీస్ లో ఏం జరిగింది. తను ఎవరు? అందరని ఎందుకు బయటకు పంపారు అని అడిగింది మీరా. దానికి జిండే నేను నీకు ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు అని జిండే (Jinde) అంటాడు.
 

35

తర్వాత మీరా (Meera ) ఆఫీస్ లో జరిగిన విషయం ఆర్యకు చెప్పగా దానికి ఆర్య.. మీరాతో నీకు ఆ విషయం గురించి అనవసరం అన్నట్లు మాట్లాడతాడు. ఆ తర్వాత రోడ్డు మీద ఉన్న రాగ సుధ ను కాపాడింది ఎవరో కాదు అను వాళ్ల అమ్మ నాన్న. ఇక వాళ్లు తనకు మంచినీళ్లు ఇస్తారు. ఈలోపు జిండే (Jinde) రోడ్ మీద గాలిస్తూ ఉంటాడు
 

45

మరోవైపు మీరా (Meera) వచ్చిన ఆమె ఎవరో తెలుసుకోవడానికి సీసీ ఫుటేజ్ చెక్ చేస్తుంది. ఆ పుటేజ్ లో రాగసుధ ప్రవర్తన చూసి ఈమే ఎందుకిలా ప్రవర్తిస్తుంది అని మీరా మనసులో అనుకుంటుంది. అసలు ఏమీ అర్థం కానీ ఉన్న మీరా.. ఆ సీసీ ఫుటేజ్ చూడడానికి అను (Anu) కి కాల్ చేసి రమ్మంటుంది.
 

55

ఇక అను (Anu)  వచ్చే లోపు ఆర్య మీరా కు ఫోన్ చేసి మాట్లాడుతూ ఈ క్రమంలో తన మనిషిని పంపించి ఆ సీసీ ఫుటేజ్ ను ఏరైజ్ చేపిస్తాడు. తర్వాత మీరా (Meera) కు పుటేజ్ ఇంతలోనే ఎలా డిలీట్ అవుతుందో అర్ధం కాదు. మరి ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.

click me!

Recommended Stories