రామ్ పోతీనినేని న్యూ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డబుల్ ఇస్మార్ట్ కోసం ఆయన సిక్స్ ప్యాక్ చేశారు. బాత్ టవల్ లో టోన్డ్ బాడీ, సిక్స్ ప్యాక్ లో రామ్ పోతినేని మెరిసిపోతున్నాడు. బాత్ రూమ్ లో మిర్రర్ ముందు ఫోజులిస్తూ.. సెల్ఫీ ఫోజులిచ్చాడు రామ్. ప్రస్తుతం ఆ పోటోలు సోషల్ మీడియాలో వైరల్అవుతున్నాయి.
సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు రామ్. మాస్ ఇమేజ్ చుట్టు పరుగులు పెడుతున్నాడు. ఇస్మార్ శంకర్ తో రామ్ కు మాస్ ఇమేజ్ వచ్చింది. కాని ఆతరువాత అదినిలబెట్టుకోలేకపోయాడు యంగ్ హీరో. ఇస్మార్ట్ తరువాత ఆయన చేసిన రెడ్, వారియర్, స్కంద లాంటి సినిమాలు ఫుల్ మాస్ కాన్సెప్ట్ లతో రిలీజ్ అయ్యాయి. కాని ఈసినిమాలు ప్లాప్అవ్వడంతో.. రామ్ కు మాత్రం ఈ సినిమాలు పెద్దగా ఉపయోగపడలేదు.
టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో రామ్ పోతినేని ఒకరు. 36 ఏళ్ళు వచ్చినా..ఆయన ఇంకా పెళ్ళి చేసుకోలేదు. రామ్ ఏజ్ గ్రూప్ స్టార్స్ అయిన శర్వానంద్, నితిన్, నిఖిల్ లాంటి హీరోలంతా పెళ్ళి చేసుకుని పిల్లల్ని కూడా కన్నారు. ఇక రామ్ ఎప్పుడెప్పుడు పెళ్లి వార్త చెపుతాడా అని ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీ గా ఉన్నాడు రామ్ పోతీనేని. అయితే సక్సెస్ కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ తరువాత రామ్ సినిమాలు హిట్ అయ్యింది లేదు. ఎంత ప్రయత్నం చేసినా.. సాలిడ్ హిట్ పడటంలేదు రామ్ కు. అందుకే తనకు ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మాస్ ఇహేజ్ ఇచ్చిన డైరెక్టర్ పూరీజగన్నాథ్ నే నమ్ముకున్నాడు రామ్.
రామ్ పోతినేతి త్వరలోనే డబుల్ ఇస్మార్ట్ మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా పూరీ జగన్నాథ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కావ్య థాపర్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో సైతం డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కాబోతోంది.
ఇక రామ్ ఆశలన్నీ డబుల్ ఇస్మార్ట్ పైనే ఉన్నాయి. పూరీ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు రామ్. ఈమూవీ కోసమే రామ్ సిక్స ప్యాక్ తో హ్యాండ్సమ్ గా తయారయ్యి.. ఫ్యాన్స్ ను అలరిస్తున్నాడు. చాక్లెట్ బాయ్ రామ్ కు లేడీ ఫాలోయింగ్ ఎక్కువ కావడంతె.. నెట్టింట ఆయన పిక్స్ కు లక్షల్లో లైకులు వస్తున్నాయి.