మృణాల్ వాడే బ్యూటీ ప్రొడక్ట్స్ ఇవే..!

First Published | Aug 12, 2024, 2:19 PM IST

మృణాల్ ని మనం ఏ మూవీలో చూసినా చాలా సింపుల్ గా ఉంటుంది. ఓవర్ మేకప్ అవ్వదు. మరి.. అంత తక్కువ మేకప్ వేసినా ఆమె అంత సహజంగా ఎలా కనపడుతుందో.. ఆమె బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం..

తెలుగు ప్రేక్షకులకు ప్రస్తుతం పరిచయం అవసరం లేని పేరు మృణాల్. సీతారామ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ.. అందరి మనసులు దో చేసింది. ఆ సినిమాలో ఆమె నటనకు, అందానికి అందరూ ఫిదా అయిపోయారు. ఆ మూవీ తర్వాత.. ఆమెకు వరసగా టాలీవుడ్ లో ఛాన్సులు అందుకుంటోంది. మృణాల్ ని మనం ఏ మూవీలో చూసినా చాలా సింపుల్ గా ఉంటుంది. ఓవర్ మేకప్ అవ్వదు. మరి.. అంత తక్కువ మేకప్ వేసినా ఆమె అంత సహజంగా ఎలా కనపడుతుందో.. ఆమె బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం..

మృణాల్ తన బ్యూటీ విషయంలో  చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది.  తాను హీరోయిన్ కదా అని.. బ్రాండెడ్ క్రీములు, ఆయిల్స్ వాడదట. కెమికల్స్ ఉండే ఉత్పత్తులకు బదులు... ఆర్గానిక్ ఉత్పత్తులు మాత్రమే  వాడుతుందట. వాటి కారణంగానే ఆమె సహజంగా అందంగా కనపడుతుందట.
 


మృణాల్ తన స్కిన్ ఫ్లాలెస్ గా  కనిపించడం కోసం, స్మూత్ గా మారేందుకు ఎందుకు ఆమె కలబంద గుజ్జు వాడతారట.  సన్ స్క్రీన్ లోషన్ కి బదులుగా కూడా ఆమె కలబంద గుజ్జునే వాడతారట. అందుకే ఆమె స్కిన్ చాలా మృదువుగా ఉంటుంది.
 

ఫేస్ మాస్క్ కూడా ఆమె సహజ ఉత్పత్తులతో  తయారు చేసిన పదార్థాలనే ఉపయోగిస్తారట.  ఆమె తన ముఖానికి బొప్పాయి మాస్క్ ని  లేదంటే.. బొప్పాయి, తేనె, పంచదార కలిపిన స్క్రబ్ ని కానీ తరచూ ఉపయోగిస్తూ ఉంటారట. దీని వల్ల.. ముఖం మెరుస్తూ కనపడుతుంది. స్క్రబ్ కారణంగా.. ముఖంపై ఉన్న డెడ్ స్కిన్ మొత్తం పోతుంది. 
 

తన శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుకునేందుకు ఆమె మంచినీరు కూడా ఎక్కువగా తాగుతూ ఉంటారట. దాని వల్ల చర్మం తాజాగా కనిపిస్తూ ఉంటుంది.
 

mrunal thakur real life incident

ఇక.. తన శరీరాన్ని అందంగా ఉంచడమే కాదు... ఫిట్ గా ఉంచుకోవడానికి కూడా ఆమె శ్రద్ధ చూపిస్తారు. అందుకోసం ప్రతిరోజూ ఆమె వర్కౌట్స్ చేస్తూ ఉంటారట. వర్కౌట్స్ కారణంగా కూడా చర్మం సహజంగా అందంగా కనిపిస్తుందట.
 

తాను తీసుకునే ఆహారం విషయంలోనూ ఆమె జాగ్రత్తలు వహిస్తారట. జంక్ ఫుడ్ ని అస్సలు తీసుకోరట. ఎక్కువగా సలాడ్స్, తాజా పండ్ల రసాలను మాత్రమే ఆమె తాగుతారట.

Latest Videos

click me!