పూరి జగన్నాథ్ తాజా చిత్రం డబుల్ ఇస్మార్ట్ మరో మూడు రోజుల్లో విడుదల కానుంది. రామ్, కావ్య థాపర్ హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్ర పై భారీగా అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా నైజాంలో విడుదలకు లైగర్ పంచాయితీ సమస్యగా మారింది. పూరి గత చిత్రం లైగర్. విజయ్ దేవర కొండా హీరోగా పూరి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఇండస్ట్రీ డిజాస్టర్ లలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాను భారీ ధర వెచ్చించి నైజాం రైట్స్ కొనుగోలు చేసాడు వరంగల్ శ్రీను. లైగర్ ఫ్లాప్ తో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు భారీగా నష్టపోయారు. తమకు నష్ట పరిహారం చెల్లించకుండా నైజాంలో డబుల్ ఇస్మార్ట్ విడుదలను నిలిపివేయాలని డిస్ట్రిబ్యూటర్లు మరియు ఎగ్జిబిటర్లు ఫిల్మ్ ఛాంబర్‌ను ఆశ్రయించారు. కొందరు ఈ విడుదలను బహిష్కరించాలని కూడా నిర్ణయించుకున్నారు.
డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ లైగర్ సెటిల్మెంట్ కాంపన్షేషన్ గా ఆరు కోట్ల రూపాయలు చెల్లించాల్సిందే అని తేల్చి చెప్పినట్లు సమచారం. లైగర్ నష్టాలు చెల్లించకపోతే నైజాం ఏరియా లో డబుల్ ఇస్మార్ట్ విడుదల కాకుండా అడ్డంకులు సృష్టించేందుకు డిస్ట్రిబ్యూటర్స్ రెడీ అయ్యారు. దానితో డబుల్ ఇస్మార్ట్ విడుదలపై డౌట్స్ మొదలయ్యాయి. గత వారం రోజులుగా లైగర్ పంచాయితీ నడుస్తుంది. లైగర్ విషయం తేలితే కానీ.. డబుల్ ఇస్మార్ట్ విడుదలకు రూట్ క్లియర్ అవ్వదని అందరికీ అర్దమైంది.
పూరి జగన్నాథ్ గతంలో కొంత కాంపన్షేషన్ కడతానని కమిటయ్యారు. కానీ రకరకాల కారణాలతో అది జరగలేదు. దాంతో డిస్ట్రిబ్యూటర్స్ మండిపడ్డారు. తాము స్టైక్ కు రెడీ అవుతామన్నారు. అప్పుడు కూడా పూరి పెద్దగా అటెన్షన్ పే చేయలేదు. తన పనేదో తను చేసుకుంటూ వెళ్లిపోయాడు. దాంతో వాళ్లకు డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కు ముందు తప్పించి ఈ మేటర్ సెటిల్ కాదని అర్దమైంది. దాంతో పట్టుపట్టారు. పూరి కు కూడా వేరే అప్షన్ లేదని క్లారిటీ వచ్చేసింది. ఆరు కోట్ల ు పే చేయటానికి ముందుకు వచ్చారని తెలుస్తోంది. ఆ రకంగా డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కు రూట్ క్లియర్ అయ్యింది.
డబుల్ ఇస్మార్ట్ సినిమాకు లైగర్ కష్టాలు తీరినట్టే అంటున్నారు. లైగర్ తో నష్టపోయిన బయ్యర్లకు నలభై శాతం నష్టాలు భర్తీ చేయడానికి సెటిల్మెంట్ చెయ్యడంతో పూరి జగన్నాధ్ పై ప్రెజర్ తగ్గింది. దానితో డబుల్ ఇస్మార్ట్ విడుదలకు ఉన్న అడ్డంకులు ఆల్మోస్ట్ తొలిగిపోయాయి. ఆరు కోట్ల రూపాయలు అందుకోసం పూరి జగన్నాథ్ కట్టబోతున్నట్లు సమాచారం. కాబట్టి ఆగష్టు 15 న డబుల్ ఇస్మార్ట్ థియేటర్స్ లో మాస్ పూనకాలు తెప్పించడానికి రెడీ అయినట్లే.
Puri Jagannadh
డబుల్ ఇస్మార్ట్ హక్కులను హనుమాన్ నిర్మాత ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ఏకంగా రూ.54 కోట్లకు కొనుగోలు చేయడం పూరికి కలిసొచ్చింది. హిందీ వెర్షన్ హక్కులు కాకుండా మిగతా భాషల హక్కుల కోసం ఇంత మొత్తం చెల్లిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ హక్కులను ఆ సంస్థ సొంతం చేసుకుంది. ఆగస్ట్ 15న మూవీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఆ హాలిడే వీకెండ్ ఈ మూవీకి భారీ ఓపెనింగ్స్ ఖాయమన్న అంచనా నేపథ్యంలో పెద్ద మొత్తం ఇవ్వడానికి ఆ సంస్థ ముందుకు వచ్చింది. ఈ మొత్తం రూ.60 కోట్లు కాగా.. ఇందులో రూ.6 కోట్లు రికవరబుల్ అడ్వాన్స్, రూ.54 కోట్లు నాన్ రికవరబుల్ అడ్వాన్స్ గా ఉంది.
గతంలో పూరి ఈ విషయమై మాట్లాడుతూ... నేను ఎప్పుడైనా మోసం చేస్తే, దగా చేస్తే అది నన్ను నమ్మి నా సినిమా టికెట్ కొన్న ఆడియెన్స్ ని తప్ప ఇంకెవ్వరిని నేను మోసం చెయ్యలేదు. వాస్తావానికి నేను నా ఆడియెన్స్ తో నిజాయితిగా ఉన్నాను. ఏదేమైనా మళ్లీ ఇంకో సినిమా తీస్తా. ఆడియెన్స్ ను తప్పకుండా ఎంటర్ టైన్ చేస్తా. డబ్బు విషయానికొస్తే చచ్చినాక ఇక్కడనుండి ఒక్క రూపాయి తీసుకెళ్లినోడు లేదు. ఫైనల్ గా అందరం కలిసేది స్మశానంలోనే.. మధ్యలో జరిగేది అంతా డ్రామా’ అంటూ తన మార్క్ లో లెటర్ రాశారు.