చియాన్ విక్రమ్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం తంగలాన్ మరి కాసేపట్లో ఆడియన్స్ ముందుకు వచ్చేస్తోంది. ఆగష్టు 15న వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ అవుతోంది. పా రంజిత్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. నటన కోసం ఎంత దూరం అయినా వెళ్లే విక్రమ్ ఈ చిత్రం కోసం కూడా ప్రాణం పెట్టేశాడు.