‘లైగర్’ డిజాస్టర్ అయినా, 'డబుల్ ఇస్మార్ట్' పై ఆ ఇంపాక్ట్ అసలు కనిపించటం లేదు. ఇప్పటికే నాన్ థియేట్రికల్ బిజినెస్ బ్రహ్మాండంగా జరిగింది. రిలీజ్ కు ముందే ఆ సినిమా సేఫ్. అలాగే ఇప్పటికే రిలీజైన ప్రమోషన్ మెటీరియల్ చూస్తుంటే....మనకు ఒకటి అర్దమవుతుంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా బాగా ఖర్చుపెట్టి ‘డబుల్ ఇస్మార్ట్’ తన సొంత బ్యానర్‌లో తీశాడు. ఎందుకంటే తన కథను అంతలా నమ్మాడు పూరి. ఆగస్టు 15న ఈ సినిమా విడుదల అవుతోంది. వరుసగా సెలవలు కలసిరావడంతో లాంగ్ వీకెండ్ దక్కింది. సో… సినిమా బాగుంటే, థియేట్రికల్ నుంచి కూడా మంచి కలెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈక్రమంలో అసలు ఈ సారి 'డబుల్ ఇస్మార్ట్' కథ ఎలా జరగనుంది అనే డిస్కషన్ మొదలైంది.
Double iSmart
ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్(Sanjay Dut)విలన్గా చేయటమే బాగా కలిసి వస్తోదంటున్నారు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి టీజర్, సింగిల్ రిలీజ్ చేస్తే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అలాగే రెండు సాంగ్స్ వదిలితే అవి జనాల్లోకి బాగా వెళ్లిపోయాయి. రెండో పాట వివాదంలోనూ ఇరుక్కుని మంచి పబ్లిసిటీ తెచ్చిపెడుతోంది. పూరి మళ్లీ ఫామ్ లోకి వచ్చారని, ఆయన మార్క్ లెవల్లో డైలాగ్స్ అదిరిపోయి చెప్పుకుంటున్నారు. ఈ నేపధ్యంలో బిజినెస్ కూడా అంతే క్రేజీగా అయ్యిపోవటం సహజం.
Ram Pothineni Double ISMART
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు హనుమాన్ నిర్మాతలు ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ వారు 'డబుల్ ఇస్మార్ట్' .. నార్త్ ఇండియా మినహా వరల్డ్ వైడ్ హక్కులను 54 కోట్లకు థియేటర్ హక్కులు తీసుకున్నారు. ఇది మాసివ్ డీల్. ఆగస్ట్ 15 రిలీజ్ డేట్ ఇవ్వటం బిగ్ హాలీడే వీకెండ్ కావటంతో కలెక్షన్స్ టాక్ తో సంభందం లేకుండా కుమ్మేస్తాయని భావించే అంత రేటు పెట్టి తీసుకున్నారు.
‘కేజీఎఫ్’తో అధిరాగా భయపెట్టిన బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ (Sanjay Dutt) కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) - రామ్ పోతినేని (Ram Pothineni) కాంబోలో వస్తున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart)తో అలరించబోతున్నారు.
అలాగే సౌత్ ఇండియన్ లోని అన్ని భాషల ఓటీటీ రైట్స్ అమేజాన్ రూ.33 కోట్లకు చేజిక్కించుకొంది. ఆదిత్య సంస్థ ఆడియో రైట్స్ ని రూ.9 కోట్లకు కొనేసింది. అంటే… ఇక్కడే వంద కోట్లు వచ్చేశాయి. ఇక హిందీ డబ్బింగ్, శాటిలైట్ రైట్స్, తెలుగు శాటిలైట్ హక్కులూ అమ్ముడవ్వాలి. సంజయ్‌దత్ ఉన్నాడు కాబట్టి, హిందీ డబ్బింగ్ మంచి రేటే పలికే అవకాశం ఉంది. ఆ రూపేణా ఎటు చూసినా మరో రూ.20 కోట్ల వరకూ వచ్చేస్తుంది.
స్టోరీి లైన్
‘ఇస్మార్ట్ శంకర్’ లో హీరో రామ్ మెదడులో చిప్ పెట్టి దాని చుట్టూ కావల్సినంత యాక్షన్, డ్రామా, వినోదం వర్కవుట్ చేసారు. అప్పట్లో ఆ పాయింట్ కొత్తగా అనిపించింది. ఇప్పుడు ‘డబుల్ ఇస్మార్ట్’ వస్తోంది. ఇందులో పూరి కొత్తగా ఏం చూపబోతున్నాడు? ఈ సారి ఏం కొత్త ఎలిమెంట్స్ కొత్తగా ఏం చూపించబోతున్నాడు? అనే ఆసక్తి నెలకొంది అందరిలోనూ.
అసలు ట్విస్ట్
ఇక ‘ఇస్మార్ట్ శంకర్’లో సత్యదేవ్ చిప్.. రామ్ లో ఫిక్స్ చేస్తారు. ఈసారి. కూడా అలాంటి నేరేషన్ లోనే నడవనుండి. అయితే ఈ సారి చిప్ మారుతుంది. సంజయ్ దత్ చిప్ వాడారని టాక్. సంజూభాయ్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అతని మెమొరీని హీరోలో ఇంజెక్ట్ చేస్తారు. ఆ తరవాత జరిగే డ్రామానే ‘డబుల్ ఇస్మార్ట్’ కథ అంటున్నారు.
డబుల్ ఇస్మార్ట్ సినిమాతో హిట్ కొట్టాలని పూరి జగన్నాథ్-రామ్ కసిగా ఉన్నారు. ఇంట్రెస్టింగ్‌గా వీరిద్దరి లాస్ట్ హిట్ ఇస్మార్ట్ శంకర్‌యే కావడం విశేషం. రామ్ చివరిగా స్కంద సినిమాతో ఆడియన్స్‌ను పలకరించాడు. గత ఏడాది రిలీజైన ఈ చిత్రం ఆడియన్స్‌ను అనుకున్నతంగా ఆకట్టుకోలేకపోయింది. మరోవైపు పూరి జగన్నాథ్ చివరిగా లైగర్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించారు. విజయ్ దేవరకొండతో చేసిన ఈ సినిమాతో ఫ్లాప్ అయింది.
'పూరి కనెక్ట్స్' బ్యానర్‌పై హీరోయిన్ ఛార్మి, పూరి జగన్నాథ్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకి మ్యూజిక్ ఇస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సారి ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుంది. పూరీ ముంబైలో డబుల్ ఇస్మార్ట్ క్లైమాక్స్ ఫైట్ సీన్ తీశాడని..ఈ సీన్ కోసం ఏకంగా రూ.7 కోట్లు పెట్టాడని టాక్ వినిపించింది. ఆలీ, షియాజీ షిండే, ఉత్తేజ్, గెటప్ శీను తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.