`ఆపరేషన్‌ రావణ్‌` మూవీ రివ్యూ, రేటింగ్‌

First Published | Jul 26, 2024, 10:06 PM IST

`పలాస` చిత్రంతో ఆకట్టుకున్న రక్షిత్‌ అట్లూరి హీరోగా నెక్ట్స్ లెవల్‌కి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు.  ఇప్పుడు `ఆపరేషన్‌ రావణ్‌` చిత్రంతో వచ్చాడు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

యంగ్ హీరో రక్షిత్‌ అట్లూరి కంటెంట్‌ ఓరియెంటెడ్‌ చిత్రాలతో మెప్పిస్తున్నారు. `పలాస` చిత్రంతో పెద్ద హిట్‌ అందుకున్న ఆయనకు మళ్లీ ఆ స్థాయి విజయాలు దక్కలేదు. తాజాగా మరోసారి హిట్‌ కోసం ప్రయత్నం చేశాడు. ఇప్పుడు `ఆపరేషన రావణ్‌` చిత్రంతో వచ్చాడు. తన తండ్రి వెంకట సత్యనే ఈ మూవీకి దర్శకత్వం వహించడం విశేషం. ఆయన ఈ సినిమాతోనే దర్శకుడిగా మారారు. రక్షిత్‌కి జోడీగా సంగీర్తన విపిన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ నేడు శుక్రవారం(జులై 26)న విడుదలైంది. మరి ఈ సారైన రక్షిత్‌కి హిట్‌ దక్కిందా? సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో తెలుసుకుందాం. 
 

కథః 
రామ్(రక్షిత్ అట్లూరి) ప్రముఖ న్యూస్‌ ఛానెల్‌ చైర్మెన్‌ కొడుకు. ఆ విషయం దాచి అదే ఛానెల్‌లో ఎంప్లాయ్‌గా జాయిన్‌ అవుతాడు. కింది స్థాయి ఉద్యోగులు ఏం చేస్తున్నారు? ఛానెల్‌లో అసలు ఏం జరుగుతుందనేది తెలుసుకునేందుకు ఆయన ఈ ప్లాన్‌ చేస్తాడు. అందులో ఆమని(సంగీర్తన) జర్నలిస్ట్ గా పనిచేస్తుంది. ఆమని అంటే రామ్‌కి ఇష్టం. చదువుకునే రోజుల నుంచే ఆమెని ప్రేమిస్తుంటారు. కానీ ఆమె ఆయన్ని తిరస్కరిస్తుంది. అయినా ఆమెని ఇంప్రెస్‌ చేసే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. మరోవైపు ఆమని ఓ మంత్రి(రఘు) అవినీతిని బయటపెట్టాలని చెప్పి స్టింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుంది. అనేక షాకింగ్‌ విషయాలను కనిపెట్టి ఛానెల్‌లో టెలికాస్ట్ చేద్దామని ఈసీఓ(మూర్తి)కి ఇస్తే ఆయన ఆ కేసుని పక్కన పెట్టేస్తాడు. సీరియల్‌ కిల్లర్‌ కేసుని అప్పగిస్తాడు. ఆమెకి సపోర్ట్ గా రామ్‌ని పంపిస్తారు. ఆ సమయంలో సీరియస్‌ కిల్లర్‌ వరుసగా అమ్మాయిలను కిడ్నాప్‌ చేసి చంపేస్తుంటాడు. ఈ కేసు పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఇంతలోనే సుజాత(రాధికా శరత్‌ కుమార్‌) కూతురు కిడ్నాప్‌ అవుతుంది. ఆమెకి త్వరలోనే పెళ్లి. దీంతో సుజాత పోలీసుల వెంటపడుతుంది. ఇన్వెస్టిగేషన్‌ జరుగుతున్న సమయంలోనే చివరికి ఆమని కూడా కిడ్నాప్‌ అవుతుంది. మరి ఆమెని కిడ్నాప్‌ చేసింది ఎవరు? సీరియల్‌ కిల్లర్ మోటో ఏంటి? అతన్ని పట్టుకున్నారా? రామ్‌ తన ప్రియురాలి కోసం ఏం చేశాడు? అనంతరం సినిమాలో చోటు చేసుకున్న ట్విస్ట్ లు, టర్న్ లు ఏంటనేది మిగిలి కథ.  
 

Latest Videos


విశ్లేషణః
సీరియ్‌ కిల్లర్‌ నేపథ్యంలో చాలా సినిమాలు వస్తున్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్‌ ఎలిమెంట్లు ఎంత రక్తికట్టించేలా ఉంటే అంతగా ఆదరణ పొందుతుంటాయి. ఇలాంటి కథలకు ఎప్పుడూ సేలబులిటీ ఉంటుంది. థియేటర్లో కూర్చున్న ఆడియెన్స్ ని రెండున్నర గంటలపాటు ఎంగేజ్‌ చేస్తే, సస్పెన్స్ క్రియేట్‌ చేసి వారిని థ్రిల్‌కి గురి చేస్తే సినిమా సక్సెస్‌ అయినట్టే. `ఆపరేషన్‌ రావణ్‌` విషయంలో దర్శకుడు అదే చేశాడు. అయితే అది ఆశించిన స్థాయిలో లేకపోయినా ఫర్వలేదనిపించేలా ఉంది. ఈ సినిమా ఓ వ్యక్తి సైకో కిల్లర్‌గా, సీరియల్‌ కిల్లర్‌గా ఎలా మారతాడనే పాయింట్‌ నుంచి ప్రారంభమయ్యింది. ఎలా మారాడు, ఎందుకు మారాడనే అంశాల చుట్టూ కథని తిప్పుతూ ఈ సినిమాని నడిపించాడు. ఓ వైపు ప్రేమని, మరోవైపు సీరియస్‌ కిల్లర్‌ అరాచకాలను, మరోవైపు న్యూస్‌ ఛానెల్‌లో జరిగే విషయాలను, ఇలా అనేక అంశాలను ఏక కాలంలో ఇందులో చూపిస్తూ సినిమాని రక్తికట్టించే ప్రయత్నం చేశారు. 

సాధారణంగా ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్, మర్డర్‌ మిస్టరీ చిత్రాలు కేవలం ఆ సస్పెన్స్ అంశాల చుట్టూ, కిల్లర్‌ని కనిపెట్టేందుకు జరిగే ఇన్వెస్టిగేషన్‌ చుట్టూతే తిరుగుతుంటుంది. కానీ ఇందులో భిన్నమైన లేయర్స్ చూపించి సాహసం చేశారు. అయితే ఈ విషయంలో కథ కొంత ట్రాక్‌ తప్పినట్టుగా ఉంటుంది. ఫస్టాఫ్‌లో హీరోహీరోయిన్ల జాబ్‌, లవ్‌ వంటి, కమర్షియల్‌ ఎలిమెంట్ల చుట్టూ తిప్పారు. ఆ తర్వాత సైకో కిల్లర్ కథలోకి తీసుకెళ్లారు. ఈ క్రమంలో మొదటి భాగం స్లోగా సాగుతుంది. ఇంటర్వెల్‌లో ఆమని కిడ్నాప్‌తో కథ రక్తికడుతుంది. అసలు గేమ్‌ అప్పుడే స్టార్ట్ అవుతుంది. హంతకుడు ఎవరనేదానిపై సీరియస్‌గా సాగుతుంది ఫిల్మ్. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు ఉత్కంఠకి గురి చేస్తుంటాయి. ఇక క్లైమాక్స్ లో కిల్లర్‌కి సంబంధించి వచ్చే ట్విస్ట్ వాహ్‌ అనేలా ఉంటుంది. అయితే సినిమా కథ, కథనంలో చాలా చోట్ల లాజిక్‌లను వదిలేశారు. కొన్ని బేసిక్‌ విషయాలు కూడా ఇందులో మిస్‌ కావడం, దర్శకుడి అనుభవ లేమి సినిమాలో కనిపిస్తుంటుంది. దర్శకత్వం విషయంలో కొంత క్వాలిటీ మిస్‌ అయిన ఫీలింగ్‌ కలుగుతుంది. ఇలాంటి కొన్ని బేసిక్‌ విషయాలను, కథని ట్రాక్‌ తప్పించే విషయాలకు సంబంధించి దర్శకుడు కేర్‌ తీసుకుని ఉంటే బాగుండేది. 
 

నటీనటులుః 
రామ్‌ పాత్రలో రక్షిత్‌ అట్లూరి మెప్పించాడు. ఎప్పటిలాగే తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. యాక్షన్‌ సీన్లలో అదరగొట్టాడు. సినిమా సినిమాకి అతని నటనతో మెచ్చూరిటీ వస్తుంది. ఆమని పాత్రలో సంగీర్తన విపిన్‌ తనదైన నటనతో మెప్పించింది. అందం, అభినయంతో ఆకట్టుకుంది. సైకో కిల్లర్‌గా నటించిన వ్యక్తి క్లైమాక్స్ లో అదరగొట్టాడు. రాధికా శరత్‌ కుమార ఉన్నంతలో మెప్పించింది. ఎమోషనల్‌గా కట్టిపడేసింది. చరణ్‌ రాజ్‌, కాంచి, రాకెట్‌ రాఘవ తమ పాత్రలతో అలరించారు. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయి. 
 

టెక్నీకల్‌గాః
సినిమాి కెమెరా వర్క్ ఆకట్టుకునేలా ఉంది. విజువల్స్ బాగున్నాయి. మ్యూజిక్‌ ఫర్వాలేదనిపించేలా ఉంది. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ బాగుంది. ఎడిటింగ్‌ పరంగా ఇంకా వర్క్ చేయాల్సింది. చాలా కట్‌ చేస్తే బాగుండేది. ఇక దర్శకుడు వెంకట్‌ సత్య దర్శకుడిగా కొత్త. ఆ అనుభవ లేమి కనిపిస్తుంది. కానీ తొలి సినిమాని ఈ స్థాయిలో తీశాడంటే అభినందించాల్సిందే. సస్పెన్స్ అంశాలను, థ్రిల్లర్‌ ఎలిమెంట్లని, ఎమోషన్స్ ని బాగా డీల్‌ చేశాడు. కథ, కథలపై మరింత వర్క్ చేయాల్సింది. నిర్మాతలు బాగానే ఖర్చు చేశారు. 

ఫైనల్‌గా ః `ఆపరేషన్‌ రావణ్‌` కమర్షియల్‌ వేలో సాగే థ్రిల్లర్‌ మూవీ. 
రేటింగ్‌ః 2.5

click me!