ప్రభాస్ కి పెళ్లి చేసే ప్రయత్నాల్లో ఉన్నామని పలుమార్లు చెప్పిన శ్యామలాదేవి తాజాగా కీలక కామెంట్స్ చేసింది. నటుడు కృష్ణుడు భార్య గాయత్రీ, అభిలాష రెడ్డి అనే మరొక మహిళతో కలిసి హైదరాబాద్ లో చీరల వ్యాపారం ప్రారంభించారు. ఈ స్టోర్ ఓపెనింగ్ కి శ్యామలాదేవి, హైదరాబాద్ మేయర్, పలాస మూవీ ఫేమ్ రక్షిత్ అట్లూరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం శ్యామలాదేవి మీడియాతో మాట్లాడారు.