గత కొన్ని వారాలుగా రాజ్ తరుణ్, లావణ్య వివాహం మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. లావణ్య అయితే మీడియా చుట్టూ తిరుగుతూ రాజ్ తరుణ్ పై సంచలన ఆరోపణలు చేసింది. రాజ్ తరుణ్ వల్ల తనకి రెండుసార్లు అబార్షన్ అయినట్లు పేర్కొంది. తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని వ్యాఖ్యలు చేయడంతో రాజ్ తరుణ్ కి ఈ వివాదంలో బాగా ఉచ్చు బిగుసుకుంటోందని అంతా భావించారు.