9th క్లాస్ లోనే అమ్మాయికి ఫస్ట్ కిస్.... నాగచైతన్య మామూలోడు కాదు..?

First Published | Aug 11, 2024, 3:13 PM IST

చూడ్డానికి చాలా అమాయకంగా కనిపిస్తాడు కాని.. నాగచైతన్య తక్కువోడేం కాదు.. మిస్టర్ పర్ఫెక్ట్ లా ఉండే ఈ హీరో.. స్కూల్ డేస్ లోనే లవ్ స్టోరీతో పాటు.. ఫస్ట్ కిస్ ను టేస్ట్ చేశాడట. ఇంతకీ ఈ విషయం ఎవరు చెప్పారో తెలుసా..? 
 

నవయువ సాంమ్రాట్ అక్కినేని నాగచైతన్య.. టాలీవుడ్ యంగ్ హీరోస్ లో మిస్టర్ పర్ఫెక్ట్ లా ఉంటాడు. అలా అని కామ్ గోయింగ్ కాదు.. ఏం మాయ చేశావే, మనం లాంటి సినిమాల్లో తాను ప్రేమించి సమంతతో చైతూ రొమాన్స్ మామూలుగా ఉండదు.. లిప్ లాక్ లతో నాగచైతన్య.. తన రొమాంటిక్ పర్ఫామెన్స్ ను కెరీర్ బిగినింగ్ లోనే చూపించాడు. అయితే మిగిలిన సినిమాల్లో ఆయన పద్దతి కాస్త వేరుగా కనిపించింది. 

చాలా కూల్ గా కామ్ గా కనిపిస్తాడు చైతూ..యూత్ ఐకాన్ లా ఉంటాడు. బిహేవియర్ విషయంలో కాని..మాట తీరు కాని.. ఎవరిని హర్ట్ చేయకుండా.. కామ్ గోయింగ్ లా ఉంటాడు చైతూ..  సమంతను నాలుగైదేళ్లకు పైగానే ప్రేమించినా..ఆ విషయం వాళ్లు చెప్పే వరకూ తెలియలేదు అంటే.. చైతూ  టాలెంట్ ఏంటో అర్ధం అవుతుంది. 


ఇక సమంతతో ప్రేమ పెళ్లి.. ఆతరువాత మనస్పర్ధలు.. విడాకులు.. ఇవన్నీ అందరికి తెలిసినవే.. ఇక తాజాగా మరో బోల్డ్ హీరోయిన్ శోభిత ధూళిపాళతో మళ్లీ ప్రేమాయణం.. డేటింగ్ .. ఇప్పుడు ఎంగేజ్మెంట్ వరకూ వచ్చారు.  అయితే నాగచైతన్యకు సబంధించిన.. రియల్ లైఫ్ రొమాంటిక్ విషయం ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. అదేంటో కాదు.. చైతూ స్కూల్ డేస్ లవ్.. ఫస్ట్ కిస్ కు  సంబంధించిన విషయం. 

నాగ చైత‌న్య  ఇంత‌కుముందు కూడా ఇద్ద‌రితో ఒకే టైంలో రిలేష‌న్‌లో ఉన్నాన‌ని.. ఒప్పుకున్నాడు. తనకు తానే ఈ విషయాన్ని వెల్లడించడం విశేషం. నాగచైతన్య మిస్టర్ పర్ఫెక్ట్ కాదు.. ప్లే బాయ్ అంటూ ఫ్యాన్స్ ఆటపట్టిస్తున్నారు నెట్టింట. దానికి కారణం కూడా లేకపోలేదు. నాగచైతన్య రొమాంటిక్ సీక్రేట్ ను రానా దగ్గుబాటి బయకు లాగాడు ఓ షోలో.  రానా హోస్ట్ చేసిన నెం.1. యారి ప్రోగ్రామ్‌కి వెళ్లిన నాగ చైత‌న్య‌ను రానా నీ ఫ‌స్ట్ కిస్ గురించి చెప్పు అంటాడు.
 

Naga ChaitanyaNaga Chaitanya

దీనికి నాగా చైత‌న్య స‌మాధానమిస్తూ.. 9వ క్లాస్‌లో ఒక అమ్మాయికి ముద్దు పెట్టాను అన్నాడు. ఆ షోలో చైతూ పక్కనే ఉన్న ఆయన కజిన్ సుమంత్ ఈ విషయం విని... షాక్ అయ్యాడు.. వెంటనే రానా అందుకుని..  చూడ‌డానికి ఇంత అమాయకంగా ఉన్నావ్ క‌దరా అన్నారు. దాంతో  చైతూ.. రిప్ల‌య్ ఇస్తూ.. అమాయకంగా ఉండ‌డ‌మే నాకు ప్ల‌స్ అయ్యిందిరా అని అన్నారు. 

ఇక పనిలో పనిగా..  రానా నీ ఫ‌స్ట్ కిస్ ఎప్పుడురా అని  చైతూ అడిగారు. ఆన్సర్ కూడా చైతూనే చెప్పాడు.  4వ క్లాస్‌లోనా అని అనగా.. సుమంత్ అందుకుని... కాదు 4త్ ఇయర్ లోనే కిస్ పెట్టేసి ఉంటాడు అని రానాను టీజ్ చేసే ప్రయత్నం చేశాడు. ఇక  ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Latest Videos

click me!