సినిమాకు 200 కోట్లు తీసుకునే రజినీకాంత్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?

First Published | Aug 11, 2024, 4:06 PM IST

రజినీకాంత్ తో నటించిన ఓ హీరోయిన్ ఆయన కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుందట. దేశంలోనే అతిపెద్ద స్టార్ గా ఉన్న రజినీకాంత్ ఓ హీరోయిన్ కంటే తక్కువ రెమ్యూనరేషన్ తీసుకోవడం ఏమిటీ? 
 

సూపర్ స్టార్ రజినీకాంత్ దేశం మెచ్చిన హీరో. ఆయన నెలకొల్పిన రికార్డులు మరొక హీరోకి సాధ్యం కానివి. ఎలాంటి నేపథ్యం లేకుండా స్వశక్తితో స్టార్ హీరోగా ఎదిగాడు. రజినీకాంత్ ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరో. ఆయన గత చిత్రం జైలర్ రూ. 600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రానికి మొత్తంగా రజినీకాంత్ రూ. 210 కోట్లు తీసుకున్నాడని సమాచారం. 

Rajinikanth

కాగా ఓ హీరోయిన్ రజినీకాంత్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుందట. ఇది వినడానికి ఆశ్చర్యం కలిగించే అంశం. దీపికా పదుకొనె, నయనతార, సమంత, రష్మిక మందాన వంటి స్టార్ హీరోయిన్స్ సైతం ఓ టైర్ టు హీరోకి మించి తీసుకోరు. అలాంటిది రెమ్యూనరేషన్ లో రజినీకాంత్ ని బీట్ చేసిన హీరోయిన్ ఎవరనే సందేహం మనకు కలగవచ్చు. 
 


super star rajinikanth

ఈ జనరేషన్ లో రజినీకాంత్ ని రెమ్యూనరేషన్ పరంగా బీట్ చేసే హీరో లేడు. ఇక హీరోయిన్ అంటారా... అది జరగని పని. 20 మంది స్టార్ హీరోయిన్స్ తీసుకునే మొత్తం ఒక రజినీకాంత్ తీసుకుంటాడు. రజినీకాంత్ కెరీర్ బిగినింగ్ లో జరిగిన సంఘటనను మనం చెప్పుకుంటున్నాము. 

Rajinikanth

1975లో రజినీకాంత్ నటుడిగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు. 1976లో వచ్చిన మూండ్రు ముడిచ్చు రజినీకాంత్ నటించిన 4వ చిత్రం. అప్పటికి రజినీకాంత్ కి ఫేమ్ రాలేదు. ఆయన సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. మూండ్రు ముడిచ్చు చిత్రంలో కమల్ హాసన్, రజినీకాంత్, శ్రీదేవి ప్రధాన పాత్రలు చేశారు. లెజెండరీ దర్శకుడు కే విశ్వనాథ్ తెరకెక్కించిన ఓ సీత కథ చిత్రానికి మూండ్రు ముడిచ్చు తమిళ్ రీమేక్. 

Rajinikanth

కమల్ హాసన్ అప్పటికే హీరోగా చేస్తున్నాడు. ఆయనకు కొంత ఫేమ్ ఉంది. ఇక శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు చేసింది. మూండ్రు ముడిచ్చు హీరోయిన్ గా ఆమెకు మొదటి చిత్రం. దాంతో కమల్ హాసన్, శ్రీదేవి ల కంటే రజినీకాంత్ రెమ్యునరేషన్ చాలా తక్కువట. కమల్ హాసన్ రూ. 30000 తీసుకున్నారట. ఇక శ్రీదేవి రెమ్యూనరేషన్ రూ. 5000 కాగా రజినీకాంత్ కి కేవలం రూ. 2000 ఇచ్చారట. కే బాలచందర్ దర్శకత్వం వహించిన మూండ్రు ముడిచ్చు సూపర్ హిట్ కొట్టింది. 

Latest Videos

click me!