ఆదిపురుష్ తో పోల్చితే హనుమాన్ చీప్ సినిమా.. డైరెక్టర్ కి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన ప్రశాంత్ వర్మ

First Published Apr 17, 2024, 5:37 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం ఎన్నో అంచనాల నడుమ విడుదలై ఎలా విమర్శలు మూటగట్టుకుందో తెలిసిందే.

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం ఎన్నో అంచనాల నడుమ విడుదలై ఎలా విమర్శలు మూటగట్టుకుందో తెలిసిందే. డైరెక్టర్ తప్పిదం వల్ల కనీసం యావరేజ్ సినిమా కావాల్సిన ఆదిపురుష్ బాక్సాఫీస్ వద్ద చతికిలబడింది. ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తున్నాడు అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సినీ ప్రేక్షకులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూశారు. 

ఆ హైప్ కి సినిమా యావరేజ్ గా ఉన్న కలెక్షన్స్ అదిరిపోయేవి. కానీ రామాయణంతో గ్రాఫిక్స్ మాయాజాలం చేయాలనుకున్న ఓం రౌత్ పెద్ద తప్పే చేశారు. దీనితో ఆదిపురుష్ చిత్రానికి విమర్శలు తప్పలేదు. 500 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. 

ఈ ఏడాది హనుమాన్ చిత్రం విడుదలయ్యాక మరోసారి ఆదిపురుష్ పై ట్రోలింగ్ జరిగింది. ఓం రౌత్ వందల కోట్లు ఖర్చు చేసి నిరాశపరిస్తే.. ప్రశాంత్ వర్మ మాత్రం తక్కువ బడ్జెట్ లో అదిరిపోయే క్వాలిటీ అందించారు. దీనితో హను మాన్, ఆదిపురుష్ ని పోల్చుతూ చాలా మీమ్స్ కూడా వైరల్ అయ్యాయి. 

తాజాగా ఈ రెండు చిత్రాలపై రాంగోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హనుమాన్, ఆదిపురుష్ చిత్రాలని గమనిస్తే ఒక విషయం క్లియర్ గా అర్థం అవుతుంది. ఆదిపురుష్ గ్రాఫిక్స్ కోసం ఫారెన్ కంపెనీలు వర్క్ చేసాయి. కానీ హను మాన్ గ్రాఫిక్స్ ని ప్రశాంత్ వర్మ ఎక్కడో కరీంనగర్ లాంటి టౌన్ లో పూర్తి చేశాడు. 

దీని గురించి ప్రశాంత్ వర్మని అడిగితే.. సర్ ఫారెన్ లో గ్రాఫిక్స్ వర్క్ చేసినా చిన్న టౌన్ లో చేసినా ఒక రూమ్ లో కూర్చునే చేయాలి కదా సర్ అన్నాడు. నాకు బుర్ర తిరిగిపోయింది అని వర్మ తెలిపాడు. 

బడ్జెట్ పరంగా చూస్తే ఆదిపురుష్ తో పోల్చితే హనుమాన్ చీప్ మూవీ. కానీ రెండు చిత్రాల రిజల్ట్ ఏంటి.. హనుమాన్ సూపర్ సక్సెస్ అయింది అని గోపాల్ వర్మ అన్నారు. 

click me!