ఇండియాన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన వర్మ, ఎన్నో వివాదాస్పద సినిమాలు కూడా చేసి విమర్శలకు గురయ్యాడు. వర్మ మనసులో ఏది దాచుకోడు. తనకు అనిపించిన విషయాలు బయటకు వెల్లడించడం అతనికి అలవాటు. ఇలా ఎన్నో విషయాలు బయటకు చెప్పకూడనివి కూడా పబ్లిక్ గా మాట్లాడి, విమర్శలపాలు అయిన సంఘటనలు చాలా ఉన్నాయి.
అయితే రామ్ గోపాల్ వర్మ పలు ఇంటర్వ్యూలలో తన కాలేజ్ లైఫ్ గురించి చాలా విషయాలు వెల్లడించారు. అందులో తన ఫస్ట్ లవ్ లాంటి ఆసక్తికర విషయాలెన్నో ఉన్నాయి. అయితే ఆర్జీవి ప్రేమ అనగానే అందరికి శ్రీదేవి గుర్తుకు వస్తుంది. ఆమెను వర్మ ఎంత అభిమానించేవారో అందరికి తెలుసు. కాని రామ్ గోపాల్ వర్మ ఫస్ట్ లవ్ మాత్రం శ్రీదేవి కాదట.