సౌందర్య రిజెక్ట్ చేసిన మూవీతో ప్రేమలో పడ్డ స్టార్‌ కపుల్‌ ఎవరో తెలుసా? లైఫ్‌లో సెటిల్‌ కావడమంటే ఇదే మరి

Published : Jun 24, 2025, 12:02 PM IST

సౌందర్య ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌. తెలుగు సినిమాని దశాబ్దానికిపైగానే శాసించిన హీరోయిన్‌. అయితే ఆమె రిజెక్ట్ చేసిన మూవీతో ఓ స్టార్‌ హీరోయిన్‌ లైఫ్‌ సెట్‌ అయ్యింది. 

PREV
16
తెలుగులో తిరుగులేని స్టార్‌ హీరోయిన్‌గా సౌందర్య

సౌందర్య తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. ఆమెకి సినిమాలంటే ఇష్టం లేకపోయిన తండ్రి బలవంతం చేయడం వల్ల సినిమాల్లోకి వచ్చింది. కానీ ఆ తర్వాత నటిగా గుర్తింపు రావడంతో మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 

వరుసగా స్టార్‌ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు అందుకుంది. ఆయా మూవీస్‌ విజయం సాధించడంతో ఆమె తిరుగులేని స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. పదేళ్లకుపైగానే ఆమె తెలుగుతోపాటు సౌత్‌ సినిమాని శాసించిందని చెప్పొచ్చు.

26
సౌందర్య వదులుకున్న సినిమాలో ఖుష్బూ హీరోయిన్‌

అయితే సౌందర్య వదులుకున్న మూవీతో ఓ హీరోయిన్‌కి లైఫ్‌ వచ్చింది. అంతేకాదు పర్సనల్‌ లైఫ్‌లోనూ సెటిల్‌ అయ్యింది. ఆ మూవీ డైరెక్టర్‌తోనే ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. మరి ఆమె ఎవరో కాదు ఖుష్బూ. కెరీర్‌ ప్రారంభంలోనూ చాలా తెలుగు సినిమాలు చేసింది ఖుష్బూ. 

1985 నుంచి 2005 వరకు హీరోయిన్‌గా సౌత్‌ని ఓ ఊపు ఊపేసింది. తెలుగులో ఆమె `కళియుగ పాండవులు`, `కెప్టెన్ నాగార్జున`, `త్రిమూర్తులు`, `భరతంలో అర్జునుడు`, `కిరాయి దాదా`, `జీవన జ్యోతి`, `శాంతి క్రాంతి`, `పేకాట పాపారావు` వంటి చిత్రాలు చేసింది. కీలక పాత్రలో చిరంజీవితో `స్టాలిన్‌` చిత్రంలోనూ మెరిసింది.

36
`మురై మామన్‌` సినిమాతో సుందర్‌ సీ ప్రేమలో పడ్డ ఖుష్బూ

ప్రస్తుతం శక్తివంతమైన పాత్రల్లో నటిస్తోంది ఖుష్బూ. చాలా సెలక్టీవ్ గా సినిమాలు చేస్తోంది. అదే సమయంలో `జబర్దస్త్` షోకి జడ్జ్ గా వ్యవహరిస్తుంది. ఈ షో ద్వారా తెలుగు ఆడియెన్స్ మరింత దగ్గరయ్యింది. ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఆకర్షిస్తుంది. 

అయితే  ఖుష్బూ తన లవ్‌ స్టోరీని బయటపెట్టింది. ఆమె దర్శకుడు సుందర్‌ సీ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తనకు సుందరి సి ఎంత క్రేజీగా లవ్‌ ప్రపోజ్‌ చేశాడో చెప్పింది. సుందర్‌ సి చాలా సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశాడు. 

ఆ తర్వాత `మురై మామన్‌` మూవీతో దర్శకుడిగా మారారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరిని తీసుకోవాలనే చర్చ వచ్చింది. మొదట సుందర్‌ సి మనసులో సౌందర్య ఉంది. ఆమె అప్పటికే స్టార్‌ హీరోయిన్‌. 

సౌందర్య డేట్స్ లేకపోవడంతో ఆమెతో మూవీ సెట్‌ కాలేదు. ఆ తర్వాత మీనాని సంప్రదించారట. ఆమె డేట్స్ కూడా సెట్‌కాలేదు. ఆ తర్వాత ఖుష్బూని తీసుకున్నారు. ఆ సమయంలో ఖుష్బూ.. సుందర్‌కి మూడో ఛాయిస్.

46
ఖుష్బూకి విచిత్రంగా లవ్‌ ప్రపోజ్‌ చేసిన ఖుష్బూ

సినిమా షూటింగ్‌ బాగా జరిగింది. షూటింగ్‌ అయిపోయే లోపు సుందర్‌కి, ఖుష్బూకి మధ్య మంచి ర్యాపో ఏర్పడింది. మనసులో ఏదో స్టార్ట్ అయ్యింది. ఇద్దరి మధ్య ఏదో జరుగుతుంది. అయితే ఆ సమయంలో కెమెరామెన్‌ తమ మధ్య వారధిలా ఉండేవాడట. 

దీంతో అంతా కెమెరామెన్‌తో ఖుష్బూ లవ్‌లో ఉందని అనుకున్నారట. అతను మా మధ్య సమాచారం పాస్‌ చేస్తున్నాడని చెప్పింది. ఈ క్రమంలో ఓ రోజు సుందర్ వచ్చి.. మనం పెళ్లి చేసుకుంటే పుట్టే పిల్లలు నీలా ఉంటారా? నాలా ఉంటారా అన్నాడట.

56
సుందర్‌ సీ కి సాకిచ్చిన ఖుష్బూ

దెబ్బకి ఖుష్బూ షాక్‌. ఏంటి ఇలా అంటున్నాడని, దాన్నుంచి తేరుకుని, ఏంటి నాకు ప్రపోజ్‌ చేస్తున్నావా? అంటే అదే కావచ్చు అన్నాడట సుందర్‌. దీంతో మరో మాట లేకుండా, మరో ఆలోచన లేకుండా ఎస్‌ చెప్పిందట ఖుష్బూ. 

ఎందుకంటే ఆల్‌రెడీ సుందర్‌కి పడిపోయింది ఖుష్బూ. అందుకే వెంటనే ఓకే చెప్పిందట. అయితే ఈ విషయంలో ఎప్పుడూ ఆటపట్టిస్తుంటాడట సుందర్‌. నేను ప్రపోజ్‌ చేయగానే ఎందుకు ఎస్‌ చెప్పావు, రెండు రోజులు ఆగి చెబుతా అని అనొచ్చు కదా, నేను ఎంతో ఫ్రీడమ్‌గా ఉండేవాడిని కదా అని అంటుంటాడట. 

అలా ఖుష్బూ, సుందర్‌ కలిసిపోయారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. సుందర్‌ సి ఇప్పుడు తమిళంలో స్టార్‌ డైరెక్టర్‌గా రాణిస్తున్నారు. హర్రర్‌ సినిమాలకు ఆయన కేరాఫ్‌గా నిలుస్తున్న విషయం తెలిసిందే.

66
సౌందర్య, మీనా ఇద్దరిలో ఎవరు చేసినా ఖుష్బూ, సుందర్‌ ఒక్కటయ్యేవాళ్లు కాదేమో

అయితే సుందర్ చేసిన `మురై మామన్‌` సినిమాలో హీరోయిన్‌గా ఆయన ఫస్ట్ ఛాయిస్‌ సౌందర్య. ఆమె ఈ మూవీ చేసి ఉంటే, ఖుష్బూ తన జీవితంలోకి వచ్చేది కాదు. అంతేకాదు మీనా డేట్స్ ఇచ్చినా ఇది జరిగేది కాదు. 

ఇదంతా ఓ డెస్టినీ ప్రకారం జరిగింది అని చెబుతూ ఆనందం వ్యక్తం చేసింది ఖుష్బూ. సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించింది ఖుష్బూ. ఆమె ఇటీవల తెలుగులో `అజ్ఞాతవాసి`, `రామబాణం`, `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం జబర్దస్త్ షోతోపాటు టీవీ సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది ఖుష్బూ.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories