RGV: వర్మ చెప్పేవి నిజంగా జీవిత సత్యాలే కదా! ఈ కొటేషన్స్‌ చదివితే ఒప్పుకోవాల్సిందే.

Published : Feb 21, 2025, 12:42 PM IST

రామ్‌గోపాల్‌ వర్మ ఈ పేరు పరిచయం లేని సగటు సినీ ప్రేక్షకుడు, ఆ మాటకొస్తే సగటు మనిషి ఉండడని  చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నిత్యం వివాదాలతో సావాసం చేసే వర్మ ఆలోచన విధానం భిన్నంగా ఉంటుంది. అయితే దీనిని ఇష్టపడే వాళ్లు కొందరు ఉంటే, తిట్టుకునే వాళ్లు మరికొందరు ఉంటారు. కానీ వర్మ చెప్పింది కరెక్టే కదా అనే వారే ఎక్కువ..   

PREV
14
RGV: వర్మ చెప్పేవి నిజంగా జీవిత సత్యాలే కదా! ఈ కొటేషన్స్‌ చదివితే ఒప్పుకోవాల్సిందే.

అప్పటి వరకు నత్త నడకన సాగుతోన్న తెలుగు సినిమాకు వేగాన్ని జోడించాడు. సినిమా అంటే ఇలానే తీయాలనే కట్టుబాట్ల బంధీలను బద్దలు కొట్టాడు. తొలి సినిమాతోనే నంది అవార్డును అందుకున్నాడు. ఇండియన్‌ సినిమా మలుపు తిప్పిన వారిలో ఒకరిగా పేరు సంపాదించుకున్న వర్మ ఏం చేసినా.. ఏం మాట్లాడినా.. అది సెన్సేషనల్. ఒకప్పుడు చరిత్రలో నిలిచిపోయే సినిమాలను అందించిన వర్మ ఇప్పుడు ఆశించిన స్థాయిలో మాత్రం విజయాలను అందుకోలేకపోతున్నారు. అయితేనేం.. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన ఫిలాసఫీతో యూత్‌ను సైతం అట్రాక్ట్‌ చేస్తున్నారు. వర్మ చెప్పిన కొన్ని జీవిత సత్యాలు, ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

24

వర్మ చెప్పిన కొన్ని ఆసక్తికరమైన జీవిత సత్యాలు:


* వాళ్లిద్దరూ ఎంతగానో ప్రేమించుకున్నారు, జీవితాంతం కలిసి ఉండాలని అనుకున్నారు. అయితే ఆ తర్వాత మాత్రం సంతోషంగా జీవించలేకపోయారు. కారణం వారిద్దరు పెళ్లి చేసుకున్నారు. 

* చావు ఏ క్షణంలో అయినా రావొచ్చని తెలుసుకున్న వాడే ప్రతీ నిమిషం సంతోషంగా జీవించగలడు. 

* మనకు జీవితంలో సమస్యలు లేకపోతే లైఫ్‌ బోర్‌ కొడుతుంది. 

* తెలివైన వాడు నీటి లోతుని ఒక కాలితో కొలుస్తాడు. మూర్ఖుడు రెండు కాళ్లు పెట్టి కొలుస్తాడు. జీనియస్‌లు మాత్రం వేరేవాడి కాళ్లతో కొలుస్తారు. 
 

34

* ఏ రిస్క్‌ తీసుకోకపోవడమే జీవితంలో అన్నింటి కంటే పెద్ద రిస్క్‌. 

* మీరు ఎప్పుడైతే మీ లక్ష్యానికి సంబంధించిన పనులతో బిజీగా మారుతారో. మీకు మనుషుల మీద ప్రేమ తగ్గడం మొదలవుతుంది. 

* మనం నమ్మిందే నిజం. నమ్మనిది అబద్ధం. 

* మన ఆలోచనలు ఎంత స్పష్టంగా ఉంటే మన జీవిత విధానం అంత గొప్పగా ఉంటుంది. 
 

44

* మీ శత్రువులను జయించాలనుకుంటే వారి ముందు సంతోషంగా ఉండండి చాలు. చలా మంది మరొకరు సంతోషంగా ఉంటే భరించలేరు. 

* హాటల్‌లో పక్కోడి ప్లేట్‌లో ఉన్న టిఫిన్‌ బాగున్నట్లు అనిపించినట్లే. పక్కోడి జీవితం కూడా బాగుందని అనిపిస్తుంది. 

* భయం లేని మనిషి ఎవ్వరూ ఉండరు. భయం ఉన్నప్పుడే మనిషి తెలివిగా ఆలోచిస్తాడు. 

* పెళ్లైన తరువాత ప్రేమ ఉండదు, బాధ్యత మాత్రమే ఉంటుంది. 
 

click me!

Recommended Stories