పెళ్ళిళ్ళకి హాజరైతే కోట్ల డబ్బు, సెలెబ్రెటీలకు అది బిజినెస్..సన్నీ లియోన్ కి ఎంత ఇస్తారంటే, ఆర్జీవీ కామెంట్స్

First Published | Aug 17, 2024, 9:40 AM IST

వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఎలాంటి అంశం గురించి అయినా తనదైన శైలిలో కామెంట్స్ చేస్తుంటారు. సెలెబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి కూడా వర్మ కామెంట్స్ చేస్తుంటారు.

వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఎలాంటి అంశం గురించి అయినా తనదైన శైలిలో కామెంట్స్ చేస్తుంటారు. సెలెబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి కూడా వర్మ కామెంట్స్ చేస్తుంటారు. తాజాగా ఇంటర్వ్యూలో సెలెబ్రిటీలు పెళ్లిళ్లు, పార్టీలకు హాజరు కావడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

అనంత్ అంబానీ వెళ్లి తర్వాత సెలెబ్రిటీలు మ్యారేజ్ పార్టీలకి హాజరై డబ్బు తీసుకుంటారనే చర్చ ఎక్కువైంది. దీని గురించి వర్మ మాట్లాడుతూ.. ఎవరైనా కూడా సెలెబ్రిటీలని పెళ్ళిళ్ళకి, బర్త్ డే పార్టీలకి, ఇతర ఫంక్షన్స్ కి ఎందుకు ఇన్వైట్ చేస్తారు ? మా పెళ్ళికి పలానా సెలెబ్రిటీలు హాజరయ్యాడు అని గొప్పలు చెప్పుకోవడానికి పిలుస్తారు. 


అంటే ఆ సెలబ్రిటీ ఇమేజ్ ని మీరు వాడుకుంటున్నారు. అలాంటప్పుడు సెలెబ్రిటీలు కూడా బిజినెస్ మైండ్ తోనే ఆలోచిస్తారు. అది కూడా ఒక బిజినెస్. అనంత్ అంబానీ పెళ్ళికి రిహన్నా, జస్టిన్ బీబర్ లాంటి హాలీవుడ్ స్టార్లు హాజరయ్యారు. వారికి అంబానీ వందల కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు  వార్తలు వచ్చాయి. 

అది నిజమే అని రాంగోపాల్ వర్మ అన్నారు. సన్నీలియోన్ కేవలం ఒక్క బర్త్ డే పార్టీకి హాజరైతే 25 లక్షలు తీసుకుంటుంది అని వర్మ అన్నారు. సన్నీలియోన్ క్రేజ్ గురించి చెప్పనవసరం లేదు. 

సన్నీ లియోన్ అంత రెమ్యునరేషన్ తీసుకుంటే.. రిహన్నాలాంటి వరల్డ్ ఫెమస్ పాప్ సింగర్ ఇంకెంత డబ్బు తీసుకుంటుందో చెప్పనవసరం లేదు. 

Latest Videos

click me!