ఇకపై అలాంటి సినిమాలు చేయను..సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ కథని రిజెక్ట్ చేసిన పవన్

First Published | Aug 17, 2024, 8:31 AM IST

ఖుషి చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఒక మెమొరబుల్ మూవీ. ఆ తర్వాత పవన్, ఎస్ జె సూర్య కాంబినేషన్ లో కొమరం పులి చిత్రం వచ్చింది. ఆ చిత్రం అంచనాలు అందుకోలేకపోయింది. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సిన చిత్రాలు అలాగే ఉన్నాయి. ఉస్తాద్, హరి హర వీరమల్లు, ఓజి చిత్రాలని పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సి ఉంది. మరి ఈ చిత్రాల కోసం పవన్ ఎప్పుడు టైం ఇస్తారో తెలియదు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ కి ఎస్ జె సూర్య ఖుషి లాంటి సూపర్ హిట్ ఇచ్చారు. 

ఖుషి చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఒక మెమొరబుల్ మూవీ. ఆ తర్వాత పవన్, ఎస్ జె సూర్య కాంబినేషన్ లో కొమరం పులి చిత్రం వచ్చింది. ఆ చిత్రం అంచనాలు అందుకోలేకపోయింది. అయితే ఖుషి తర్వాత ఎస్ జె సూర్య.. పవన్ తో మరో సినిమా చేయాలని ప్రయత్నించారట. 


Pawan Kalyan

సూర్య ప్రస్తుతం డైరెక్షన్ కి గుడ్ బై చెప్పి క్రేజీ నటుడిగా మారిపోయారు. సూర్యకి విలన్ గా అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయి. త్వరలో రిలీజ్ కాబోతున్న సరిపోదా శనివారం చిత్రంలో సూర్య విలన్ గా నటించారు. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో సూర్య.. పవన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఖుషి తర్వాత పవన్ కళ్యాణ్ కోసం మరో లవ్ స్టోరీ రాశాను. కథ మొత్తం పూర్తయ్యాక పవన్ కి వెళ్లి చెప్పాను. ఆ టైంలో పవన్ కళ్యాణ్ కొన్ని చిత్రాలతో బిజీగా ఉన్నారు. డేట్లు కుదర్లేదు. రెండేళ్ల తర్వాత మళ్ళీ కలిశా. అప్పటికి పరిస్థితులు మారిపోయాయి. 

SJ Suryah

పవన్ కళ్యాణ్ కి లవ్ స్టోరిలపై ఆసక్తి పోయింది. ఇక తను లవ్ స్టోరీ చిత్రాలు చేయను అని చెప్పారు. దీనితో ఆ చిత్రం కుదర్లేదు అని ఎస్ జె సూర్య అన్నారు. పవన్ కళ్యాణ్, ఎస్ జె సూర్య ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. సందర్భం వచ్చిన ప్రతిసారి సూర్య పవన్ గురించి మాట్లాడుతూనే ఉంటారు. 

Latest Videos

click me!