రాంగోపాల్ వర్మ ఫస్ట్ లవ్ ఎవరో జగపతి బాబు బయటపెట్టారు. 40 ఏళ్ళ తర్వాత ఆమెకి వర్మతో మాట్లాడే అవకాశం దక్కింది. వర్మ గురించి ఆమె చాలా ఎమోషనల్ గా మాట్లాడారు.
రాంగోపాల్ వర్మ పేరు వినగానే ముందుగా వివాదాలే గుర్తుకు వస్తాయి. ఎలాంటి విషయం గురించి అయినా వర్మ బోల్డ్ గా మాట్లాడేస్తుంటారు. రాంగోపాల్ వర్మ సినీ రాజకీయ ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వివాదాల్లో చిక్కుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇటీవల వర్మ ఎక్కువగా పొలిటికల్ కాంట్రవర్సీ చిత్రాలు చేశారు. ఇక వర్మ తాను అమ్మాయిలని ఎక్కువగా ఇష్టపడతానని బోల్డ్ గా అనేక సందర్భాల్లో తెలిపారు. అలాంటి వర్మ జీవితంలో చాలా ప్రేమ కథలు ఉన్నాయి. కొందరిని కొన్ని గంటలు మాత్రమే ప్రేమించిన సందర్భాలు కూడా ఉన్నాయట.
25
ఆర్జీవీ ఫస్ట్ లవ్ ఎవరో బయటపెట్టిన జగపతి బాబు
ఇటీవల వర్మ జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా అనే టీవీ షోకి అతిథిగా హాజరయ్యారు. సందీప్ రెడ్డి వంగా కూడా వర్మతో కలిసి పాల్గొన్నారు. ఈ షోలో జగపతి బాబు రాంగోపాల్ వర్మ ఫస్ట్ లవ్ గురించి బయట పెట్టారు. ఫస్ట్ లవ్ రివీల్ చేయడం మాత్రమే కాదు.. ఆమె రాంగోపాల్ వర్మతో మాట్లాడేలా చేశారు. ఇంతకీ రాంగోపాల్ వర్మ ఫస్ట్ లవ్ ఎవరు అనేది వివరాల్లో తెలుసుకుందాం.
35
40 ఏళ్ళ తర్వాత మాట్లాడిన వర్మ చిన్ననాటి ప్రేయసి
జగపతి బాబు ఈ షోలో వర్మకి సర్ప్రైజ్ అంటూ ఒక ఆడియో బైట్ వినిపించారు. ఆమె మాట్లాడుతూ '40 ఏళ్ళు కంటే ఎక్కువ అయింది మనం మాట్లాడుకుని.. అప్పుడు నీ వయసు కేవలం 16 ఏళ్ళు మాత్రమే. మనిద్దరికీ ఒక ఏడాది మాత్రమే పరిచయం ఉంది. కొన్ని గంటలు మాత్రమే కలిసి గడిపాం. కానీ నీ ఇంపాక్ట్ చాలా ఉంది. నీ గురించి నాకు తెలిసింది చాలా తక్కువ. నీకు చాలా పొగరు. ఎవ్వరినీ లెక్క చేయవు, నువ్వు అనుకున్నదే చేస్తావు. నీకు సినిమాలు చూడడం అంటే ఇష్టం అని తెలుసు. ఇండియన్ సినిమా రాముకి ముందు రాము తర్వాత అనేంతలా హిస్టరీ క్రియేట్ చేశావు. కానీ నాకు మాత్రం చిన్నప్పటి రాముకి ఇప్పటి రాముకి ఏమీ తేడా కనిపించడం లేదు. నువ్వేమి మారలేదు రామూ అంటూ ఆమె ఎమోషనల్ చెప్పారు.
ఆమె మాటలు విని ఆర్జీవీ ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. మీ రీసెర్చ్ తగలెయ్యా, ఎలా బయట పెట్టారు ఇది అంటూ వర్మ జగపతి బాబుని ఆశ్చర్యంగా అడిగారు. ఆమె గురించి వర్మ మాట్లాడుతూ.. నేను స్త్రీని ప్రేమించే రోజులు అవి.. ఇప్పుడేమో స్త్రీ జాతిని ప్రేమిస్తున్నాను అని అన్నారు. అసలు ఆ లవ్ స్టోరీ చెప్పండి సార్.. ఆమె వాయిస్ లో చాలా ఎమోషన్ కనిపించింది నాకు అని పక్కనే ఉన్న సందీప్ రెడ్డి అడిగారు.
55
ఆమె నా స్కూల్ ఫ్రెండ్, తొలిసారి ప్రేమించింది ఆమెనే
నేను కొంత మందిని నెలలు, కొంతమందిని రోజులు, కొంతమందిని గంటలు ప్రేమించాను. ప్రేమించే సమయంలో మాత్రం చాలా మనస్ఫూర్తిగా లవ్ చేశానని వర్మ అన్నారు. అవును ఆమె నాకు బాగా క్లోజ్. నా క్లాస్ ఫ్రెండ్. నా ఫస్ట్ లవ్ ఆమె. ఆ తర్వాత నేను మా స్కూల్ టీచర్ ని లవ్ చేశాను. ఆమె యుఎస్ కి వెళ్లారు. 80 ఏళ్ళ వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఆమెకి ఫోన్ చేసి మిమ్మల్ని ప్రేమించానని చెప్పినట్లు వర్మ బయట పెట్టారు. ఇలా తన లైఫ్ లో చాలా లవ్ స్టోరీలు ఉన్నట్లు తెలిపారు. వర్మ డైరెక్టర్ అయ్యాక తాను శ్రీదేవిని ఎంతగానో ఆరాధించినట్లు ఓపెన్ గా చెప్పిన సంగతి తెలిసిందే.