బాక్సాఫీస్ వద్ద షాకింగ్ టర్న్.. అనుష్క మూవీకి గట్టి పోటీ ఇచ్చిన లిటిల్ హార్ట్స్

Published : Sep 09, 2025, 01:08 PM IST

Little Hearts Vs Ghaati: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద స్టార్ డైరెక్టర్ క్రిష్- అనుష్క శెట్టి కాంబో తెరకెక్కిన ఘాటికి, యంగ్ హీరో మౌళి - సాయి మార్తాండ్ కాంబో వచ్చిన లిటిల్ హార్ట్స్ మధ్య పోరుసాగుతుంది. ఏ సినిమా ఎంత ఎన్ని కోట్లు వసూలు చేసింది? 

PREV
15
4 రోజుల్లోనే ఘాటీ వసూళ్లను మించి దూసుకెళ్లిన లిటిల్ హార్ట్స్

Little Hearts Vs Ghaati: ఈ ఏడాది చిన్న సినిమాలు ఊహించని విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు చేస్తున్నాయి. అది కూడా పెద్ద సినిమాలను డామినేట్ చేస్తూ. ఈమధ్య కాలం లో స్టార్ క్యాస్టింగ్, సక్సెస్ పుల్ డైరెక్టర్స్, బడా ప్రొడ్యూసర్లు కలిసి తెరకెక్కుతున్న సినిమాలు తీవ్ర నిరాశపరుస్తున్నాయి. ఈ వారం కూడా అదే సీన్ రిపీట్ అయ్యింది. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద లిటిల్ హార్ట్స్ vs ఘాటి మధ్య పోరుసాగుతుంది. ఈ కలెక్షన్ల యుద్ధంలో విజయం ఎవరిది?

25
ఘాటీని దాటేసిన లిటిల్ హార్ట్స్!

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఊహించని ఫలితాలు నమోదయ్యాయి. అనుష్క- క్రిష్ కాంబినేషన్ లో భారీ బడ్డెట్ తో తెరకెక్కిన సినిమా ‘ఘాటీ’. ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలైంది. కానీ, ఎవరూ ఊహించని విధంగా డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. కలెక్షన్ల పరంగా కూడా డిజాస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఇక ఘాటీ మూవీతో పాటు విడుదల ‘లిటిల్ హార్ట్స్’ఊహించని రెస్పాన్స్ అందుకుంది. ప్రీమియర్ షోస్ నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని బ్యాక్సాఫీస్ వద్ద దూసుకపోతుంది. స్టార్స్, టాప్ డైరెక్టర్స్ తెరకెక్కించిన ఘాటి సినిమాకు లిటిల్ హార్ట్స్ గట్టి పోటీనిస్తోంది. వసూళ్లలో ముందంజ నిలించింది .

35
ఘాటి కలెక్షన్లు – ఆశాజనకంగా మొదలై క్రమంగా పడిపోతూ..

స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో, అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటించిన సినిమా ఘాటి. ఈ సినిమా మొదటి రోజే మంచి ఓపెనింగ్‌ లో రూ. 2 కోట్లు వసూలు చేసింది. అయితే ఆ హైప్‌ను నిలబెట్టుకోలేకపోయింది. క్రమంగా కలెక్షన్లు పడిపోతున్నాయి. వాస్తవానికి ఘాటి మొదటి రోజు దాదాపు 10 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుందని అంచనా వేశారు. కానీ, కేవలం రూ. 2.5 కోట్ల గ్రాస్ (ప్రపంచవ్యాప్తంగా) మాత్రమే వసూలు చేసింది.

ఇక ఘాటి రెండో రోజు రూ. 2 కోట్ల గ్రాస్, మూడో రోజు రూ. 1.15 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక నిన్న అంటే సోమవారం ( డే 4 ) నాడు అనుష్క ఘాటి కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. కేవలం రూ. 0.8 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టగలిగింది. మొత్తం నాలుగు రోజుల్లో ఘాటి కలెక్షన్లు రూ. 6.8 కోట్ల గ్రాస్ వద్ద ఆగిపోయాయి. వసూళ్లు క్రమంగా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. అనుష్క ఇమేజ్ ఉన్నప్పటికీ, సినిమా కంటెంట్ సాధారణంగా ఉండడం వల్ల ప్రేక్షకుల ఆదరణ కరువైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

45
లిటిల్ హార్ట్స్ కలెక్షన్లు – చిన్న సినిమా పెద్ద విజయం

ఇక లిటిల్ హార్ట్స్ కలెక్షన్ల విషయానికి వస్తే.. సాయి మార్తాండ్ దర్శకత్వంలో, యంగ్ హీరో మౌళి, హీరోయిన్ శివాని జంటగా నటించిన సినిమా లిటిల్ హార్ట్స్. ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయాన్ని సాధించింది. రూ. 2.5 కోట్ల చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా యూత్ ఆడియెన్స్‌లో హిట్ టాక్ తెచ్చుకుని వసూళ్లలో దూసుకెళ్తోంది.

లిటిల్ హార్ట్స్ విడుదలైన రోజే ఏకంగా రూ. 2.5 కోట్ల గ్రాస్ కలెక్ట చేసింది. ఇలా తొలి రోజే బ్రేక్ ఈవెన్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ఇక రెండో రోజు నుంచి లాభాల బాటలో సాగుతోంది. ఇలా రెండో రోజు రూ. 3 కోట్ల గ్రాస్, 3 వ రోజు రూ. 3.75 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక సోమవారం కూడా లిటిల్ హార్ట్స్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. 

ఎవరూ ఊహించని విధంగా రూ. 3 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఇలా నాలుగు రోజుల్లోనే లిటిల్ హార్ట్స్ మొత్తం రూ. 12.25 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇది తన బడ్జెట్ కంటే ఆరింతలు ఎక్కువ కావడం విశేషం. ఈ చిన్న బడ్జెట్ సినిమా పెద్ద సినిమాలకు గట్టి పోటీని ఇవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

55
లిటిల్ హార్ట్స్ విజయానికి కారణాలు

అనుష్క సినిమా ఘాటి మాస్ యాక్షన్ డ్రామాగా రూపొందినప్పటికీ, కథలో కొత్తదనం లేకపోవడం, స్క్రీన్‌ప్లే నెమ్మదిగా కొనసాగడం వల్ల ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకోలేకపోయింది. దీంతో మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. కలెక్షన్లు కూడా క్రమంగా పడిపోతున్నాయి.

లిటిల్ హార్ట్స్ సినిమా విషయానికి వస్తే.. ఫ్రెష్ లవ్ స్టోరీ, యువతరానికి కనెక్ట్ అయ్యే నేటివిటీ, చిన్న బడ్జెట్‌లో చేసినా క్వాలిటీ మేకింగ్ కారణంగా సక్సెస్ సాధించింది. ఊహించని విధంగా రెస్పాన్స్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది.

తత్పలితంగా ఘాటి – 4 రోజుల్లో రూ. 6.8 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా, లిటిల్ హార్ట్స్ – 4 రోజుల్లోనే రూ. 12.25 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

చిన్న సినిమా పెద్ద సినిమాను దాటేసి ముందుకు రావడం టాలీవుడ్‌లో అరుదైన విషయం. లిటిల్ హార్ట్స్ సక్సెస్‌తో కొత్త దర్శకులకు, యంగ్ టాలెంట్‌కు ప్రేరణగా నిలిచిందని చెప్పాలి.

Read more Photos on
click me!

Recommended Stories