ఈరోజు ఎపిసోడ్ లో రిషి, వసుధార జడలో పువ్వు పెడతాడు. అప్పుడు వసుధారని పట్టుకొని అద్దం ముందు చూపిస్తూ ఉంటాడు. అప్పుడు వసుధార, రిషి ఇదురు పక్క పక్కన నిలబడి అద్దంలో చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు. తర్వాత అదే రిషి రా అని అనడంతో వస్తున్న అని వసుధారని తొందరగా రమ్మని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి. ఆ తర్వాత రిషి బయటికి రావడంతో రిషి నీ డ్రెస్ చాలా బాగుందిరా అని మరి నా డ్రెస్సు ఎలా ఉందిరా అని అనడంతో నువ్వు చెప్పి నేను చెబితే బాగుండదు రా అని అంటాడు రిషి. ఆ తర్వాత వారిద్దరూ ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు దేవయాని నొప్పితో బాధపడుతూ ఉండగా ఇంతలో వసుధార చీర కట్టుకుని కిందికి దిగిరావడం చూసి దేవయాని షాక్ అవుతుంది.