రామ్‌గోపాల్ వర్మ ప్రారంభంలో సంచలన దర్శకుడు. ఇప్పుడు వివాదాస్పద దర్శకుడిగా మారుతున్నారు. ఆయన సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్ లు, చేసే కామెంట్లు, తీసే సినిమాల పరంగా ఆయన కాంట్రావర్సియల్ పర్సన్‌గా మారుతున్నారు. బోల్డ్ కామెంట్లతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు వర్మ. తన సినిమాలను ప్రమోట్ చేసుకునే విషయంలో ఆయన వివాదాస్పద పోస్ట్ లు, సెటైర్లతో రచ్చ చేస్తుంటాడు. అందరి అటెన్షన్ తనవైపు తిప్పుకుంటాడు.
రామ్‌గోపాల్ వర్మ ఎమోషన్స్ కి దూరంగా ఉంటారు. నవ్వు, ఏడుపు, బాధ, ఆనందం వంటి వాటికి పెద్దగా ప్రయారిటీ ఇవ్వరు. రిలేషన్స్ కూడా ప్రయారిటీ ఇవ్వరు. తనకు నచ్చినట్టు ఉంటాడు, నచ్చినట్టు బతికేస్తాడు. ఏడుపు అనే ఎమోషన్ ఆయనలో ఉందా అనే డౌట్ వచ్చేలా ఉంటాడు. ఆయన్ని ఎమోషనల్‌గా ప్రభావితం చాలా కష్టం. అస్సలు సాధ్యం కూడా కాదట. అలాంటిది రామ్‌గోపాల్ వర్మ ఒక విషయంలో మాత్రం కన్నీళ్లు పెట్టుకున్నాడు. తెలియకుండానే ఏడ్చేశాడట. అసలు ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కాలేదట. మరి అంతగా ప్రభావితం చేసిన అంశమేంటి అనేది చూస్తే..
ఇటీవల జర్నలిస్ట్ ప్రేమకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకున్నాడు రామ్‌గోపాల్ వర్మ. తాను ఎప్పుడూ ఎమోషన్ కానని చెప్పిన వర్మ, ఏదో టైమ్‌లో సడెన్‌గా అలా అనిపించినా, ఐదు నిమిషాల్లోనే వాస్తవంలోకి వస్తానని తెలిపారు. కానీ ఒక విషయంలో మాత్రం తను కంట్రోల్ కాలేకపోయాడట. ఆ విషయం చెబుతూ, ప్రముఖ అమెరికన్-రష్యా రచయిత్రి అయన్ ర్యాండ్ డాక్యుమెంటరీ `ఏ సెన్స్ ఆఫ్ లైఫ్` చూసినప్పుడు మాత్రం కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ డాక్యుమెంటరీ చివరికి వచ్చేటప్పుడు తాను తెలియకుండానే ఏడ్చేస్తున్నాడట. కళ్ల నుంచి నీళ్లు కారిపోతున్నాయట. ఆ సమయంలో ఆ డాక్యుమెంటరీలో ఎలాంటి విషాదం చోటు చేసుకోలేదు, అక్కడ ఏం జరగడం లేదు.
ఆమె బతికి తీరు, సర్వైవ్ అయిన తీరుకి ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడట. అది తనకు బాగా నచ్చిందని, ఆ సమయంలో మనసు తెలియకుండానే రియాక్ట్ అయ్యిందని, అలా కన్నీళ్లు పెట్టుకున్నట్టు తెలిపాడు వర్మ. కొన్ని సంఘటనలు మనల్ని అతిగా రియాక్ట్ అయ్యేలా చేస్తుంటాయని, అలాంటి ఘటనే అది అని చెప్పాడు వర్మ.
అయన్ ర్యాండ్ అమెరికన్ ఫిలాసఫర్, రైటర్స్. అనేక విప్లవాత్మక నవలలు రాశారు. 1950-70 మధ్యలో అమెరికన్ సమాజాని తన రచనలతో, నవలలో తీవ్రంగా ప్రభావితం చేశారు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ఆమె నవలలు సినిమాలుగా వచ్చాయి. సంచలనాలు క్రియేట్ చేశాయి. ఆమె లైఫ్, ఆమె కెరీర్ ఇన్‌స్పైరింగ్‌గా నిలిచింది. ఎంతో అణచివేతని ఎదుర్కొని ఆమె మనుగడ సాధించడం మామూలు విషయం కాదు.
ఇక రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం `వ్యూహం` అనే సినిమాని తెరకెక్కించాడు. ఇది ఈ నెల 23న విడుదల కావాల్సి ఉంది. కానీ దీన్ని వాయిదా వేశారు. మార్చి 1న విడుదల చేస్తున్నారు. దీనికి కొనసాగింపుగా తీసిన `శపథం` మార్చి 8న విడుదల చేయబోతున్నారట. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం అనంతరం ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వైఎస్ జగన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మూవీని తెరకెక్కించాడు వర్మ.