మెగా కోడలు ఉపాసన కొణిదెల సోషల్ మీడియాలో యాక్టివ్ గానే కనిపిస్తుంటారు. మెగా ఫ్యామిలీ గురించి అప్డేట్స్ అందిస్తూ ఉంటారు. బ్యూటీఫుల్ ఫ్యామిలీ ఫొటోలను కూడా పంచుకుంటూ అభిమానులను ఖుషీ చేస్తుంటారు.
ఇక గతేడాది రామ్ చరణ్ - ఉపాసన దంపతులు మెగా ప్రిన్సెస్ క్లింకార (Klinkaara)కు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. చిన్నారి వచ్చిన వేళ విశేషం మెగా ఇంట సంబురాలు నిండుతున్నాయి.
ఇదిలా ఉంటే.. తాజాగా ఉపాసన గురించి సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. టాలీవుడ్ లో మంచి హీరోగా పేరున్న కథనాయకుడు అంటే తనకు అస్సలు పడదంటున్నారు.
మరి అతను ఎవరో కాందంట... అక్కినేని యంగ్ హీరో అఖిల్ (Akkineni Naga Chaitanya) అని అంటున్నారు. ఉపాసనకు అఖిల్ అంటే పడదని, అసలు అతనితో మాట్లాడటానికి ఇష్టపడదని ఓ వార్త వైరల్ గా మారింది.
అయితే, అఖిల్ గతంలో బిజినెస్ పర్సన్ శ్రేయా భూపాల్ తో ఎంగేజ్ మెంట్ చేసుకొని విడిపోవడమే కారణమంటున్నారు. ఇక ఉపాసన, శ్రేయా భూపాల్ మంచి స్నేహితులు కావడం విశేషం.
ఇక ఉపాసన అపోలో ఆస్పత్రులతో పాటు రామ్ చరణ్ కు సంబంధించిన పలు బిజినెస్ లను చూసుకుంటూ బిజీగా ఉంటున్నారు. మరోవైపు మెగా ఫ్యామిలీలో కోడలిగా తన బాధ్యతలను కూడా చక్కగా నిర్వహిస్తున్నారు.