అయితే ఆ కాంప్లిమెంట్ నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను. కారణం, నేను ఇలా మారడానికి ఎంతో శ్రమపడ్డాను. గంటల తరబడి జిమ్ లో వర్క్ ఔట్స్ చేశాను. ఆహార నియమాలు పాటించాను... అని ఉపాసన తెలియజేశారు. ప్రస్తుత స్థితికి రావడానికి ఉపాసన చాలా కష్టపడ్డారని ఆమె మాటల ద్వారా అర్ధమైంది. ఉపాసన ఫిట్నెస్ ఎక్స్పర్ట్ కాగా, చరణ్ (Ram charan) కి సలహాదారుగా కూడా ఉన్నారు.