రామ్‌చరణ్‌కు గౌరవ డాక్టరేట్‌.. ఆల్రెడీ పవన్ రిజెక్ట్ చేసారు?

Published : Apr 11, 2024, 05:12 PM IST

కళా రంగానికి చరణ్‌ చేస్తున్న సేవలను గుర్తించి డాక్టరేట్ అందిస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో ఆయన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

PREV
110
రామ్‌చరణ్‌కు గౌరవ డాక్టరేట్‌.. ఆల్రెడీ పవన్ రిజెక్ట్  చేసారు?

రీసెంట్ గా  ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ, ప్రేమ పొందిన రామ్‌చరణ్‌ (Ram Charan) తాజాగా మరో గౌరవాన్ని దక్కించుకున్నారు. చెన్నైకు చెందిన వేల్స్‌ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్‌ ప్రకటించింది.   ఏప్రిల్‌ 13న జరగనున్న విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. కళా రంగానికి చరణ్‌ చేస్తున్న సేవలను గుర్తించి డాక్టరేట్ అందిస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో ఆయన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

210


ఇక ఈ జ‌న‌వ‌రిలోనే వేల్స్ వర్చువల్ యూనివర్సిటీ (Vels University) ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు గౌర‌వ డాక్ట‌రేట్ ప్ర‌క‌టించ‌గా ఆయ‌న నా క‌న్నా రాణించిన వారు చాలామంది ఉన్నార‌ని వారికి ఈ గౌర‌వం అంద‌జేయండి అంటూ ఆ డాక్ట‌రేట్‌ను సున్నితంగా తిర‌స్క‌రించారు. గ‌తంలో ఓ  త‌మిళ ద‌ర్శ‌కుడు ఈ డాక్ట‌రేట్ అందుకోగా ఇప్పుడు రామ్ చరణ్ (Ram Charan) కు ఈ ఘ‌న‌త ద‌క్కింది. 

310


ఇక 1985 మార్చి 27న జన్మించిన చరణ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 10వ తరగతి పూర్తి చేశారు. అదే స్కూల్లో రానా దగ్గుబాటీ, శర్వానంద్ కూడా విద్యాభ్యాసం పూర్తి చేశారు. చరణ్ మొదట క్రికెటర్ కావాలనుకున్నాడట. అందుకు శిక్షణ కూడా తీసుకున్నారట. జర్మనీలో ఆటోమొబైల్ ఇంజనీర్ చేయాలని అనుకున్నారట. కానీ ఆ తర్వాత నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 

410


సినిమాల్లోకి రాకముందు చరణ్ ఏం చేసేవారనే  విషయాలను గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు చరణ్. గ ఓ ఇంటర్వ్యూలో రాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడగ్గా.. చరణ్ తన ఫస్ట్ జాబ్ ఏంటో చెప్పారు. తన మొదటి జాబ్ ఇంట్లోనే చేశానని.. కానీ అందుకు తనకు ఎలాంటి జీతం ఇవ్వలేదని అన్నారు చరణ్. కానీ ఏం జాబ్ అనేది మాత్రం రివీల్ చేయలేదు. 

510

అలాగే ఇప్పటివరకు తాను నటించిన అందరి హీరోయిన్లలో కియారా అద్వానీ యాక్టింగ్ తనకు ఇష్టమని అన్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో గ్యాంగ్ లీడర్ మూవీ ఎప్పటికీ తన ఫేవరెట్ అని అన్నారు. అలాగే తన సినిమాల్లో రంగస్థలం సినిమా ఇష్టమని అన్నారు చరణ్.

610


చిరుత సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు చరణ్. 2007లో సెప్టెంబర్ 28న ఫస్ట్ మూవీ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది. కానీ ఫస్ట్ రోజే దాదాపు రూ. 4 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ సృష్టించింది. కానీ ఈ సినిమా విడుదలైన తర్వాత చరణ్ నటనపై ఎన్నో విమర్శలు వచ్చాయి. నటన రాదని.. హీరో కంటెంట్ కాదని క్రిటిక్స్ విమర్శించారు. ఆ తర్వాత జక్కన్న డైరెక్షన్లో చరణ్ నటించిన మగధీర మూవీ సూపర్ హిట్ అయ్యింది. 

710


ఇక ఆ సినిమా తర్వాత ఎప్పటికప్పుడు వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ విలక్షణమైన నటనతో విమర్శించిన వారే పొగడ్తలు కురిపించేలా చేశాడు చరణ్. అవమానించినవారే శభాష్ అంటూ పొగిడేలా కసిగా నటించారు. గెలుపు.. ఓటమిలతో సంబంధం లేకుండా అద్భుతమైన నటనతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఒక్కసారిగా గ్లోబల్ స్టార్ క్రేజ్ అందుకున్నాడు.

810

డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. 2018లో రిలీజ్ అయిన ఈ సినిమాలో చిట్టిబాబు పాత్రలో అదరగొట్టాడు. ఈ మూవీలో చరణ్ నటనకు సినీ ప్రియులు ముగ్దులయ్యారు. ఇక రాజమౌళి తరెకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో మరోసారి తన అద్భుతమైన నటనతో విమర్శకులను ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు.

910


‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘ఆచార్య’ తర్వాత రామ్‌చరణ్‌ నటిస్తోన్న చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. శంకర్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో కియారా అడ్వాణీ కథానాయిక. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఇది సిద్ధమవుతోంది. అంజలి, ఎస్‌.జె.సూర్య, జయరామ్‌, సునీల్‌, నాజర్‌, శ్రీకాంత్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో సిద్ధమవుతోన్న ఈ చిత్రాన్ని వినాయక చవితి కానుకగా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

1010


‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబుతో చరణ్‌ ఇటీవల కొత్త చిత్రాన్ని అనౌన్స్‌ చేశారు.  జాన్వీకపూర్‌ కథానాయిక. దీని తర్వాత సుకుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.  బుచ్చితో రామ్ చరణ్ చేయబోయే సినిమాకు పెద్ది అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు టాక్. ఉత్తరాంధ్ర ప్రాంతంలో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామా అని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ లాక్ అయి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories