మెగా ఫ్యామిలీలో పాటలు పాడటం కొత్తేం కాదు.. చిరంజీవి, పవన్ కల్యాణ్ తమ సినిమాల్లో పాటలు పాడి ఫ్యాన్స్ ను దిల్ ఖుష్ చేసినవారే. ఇక ఇప్పుడు రామ్‌చరణ్ వంతు వచ్చిందంటున్నారు. ఇదే నిజమైతే గనక చరణ్ పాడే పాట ఎలా ఉంటుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటి వరకు రామ్‌చరణ్ యాక్టింగ్, డ్యాన్స్ ఫర్ఫామెన్స్ చూసిన ఫ్యాన్స్ చరణ్ సాంగ్ పాడితే ఎలా ఉంటుందోనని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అసలే ఈ వార్తలో నిజమెంతో కూడా తెలియాల్సి ఉంది.