రామ్ చరణ్ సాహసం చేయబోతున్నాడు. తన తండ్రివల్ల అవ్వనిది తాను చేసి చూపించాలని చూస్తున్నాడు. ఎలాగైనా మెగారికార్డ్స్ ను తిరగరాయాలని చూస్తున్నాడు. అయితే చరణ్ చేసే పనిలో అతి పెద్ద రిస్క్ దాగుంది. తన తండ్ర మెగాస్టార్ చిరంజీవి ప్రయత్నించి పెద్దగా ఫలితం రాని పనిని.. మెగా పవర్ స్టార్ చేసి చూపించాలని ప్లాన్ చేస్తున్నాడు.
తన తండ్రి మెగాస్టార్ చిరంజీవిని ఆదర్శంగా తీసుకున్నట్టున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఆయన లాగే పెద్ద సాహసం చేయబోతున్నాడు. రామ్ చరణ్ త్రిపాత్రాభినయం చేసి.. ఫ్యాన్స్ ను దిల్ కుష్ చేయాలని చూస్తున్నాడు. మరి అది వర్కౌట్ అవుతుందా.
మెగాస్టార్ చిరంజీవి గతంలో ట్రిపుల్ రోల్ తో అలరించాడు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్ లో ముగ్గురు మొనగాళ్లు సినిమాలో మూడు పాత్రల్లో నటించాడు చిరంజీవి. ఈ మూడు పాత్రత్లో అద్భఉతంగా నటించి మెప్పించాడు కాని.. సినిమా మాత్రం పెద్దగా వర్కౌట్ అవ్వలేదు చిరంజీవికి.
ఖైదీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత ఆరేంజ్ లో సినిమా అయినా ఉండాలి.లేదంటే.. అంతకంటే పెద్ద బ్లాక్ బస్టర్ అయినా అందుకోవాలి. కాని మెగాస్టార్ రేంజ్ లో ముగ్గురు మెనగాళ్ళు సినిమా అలరించలేకపోయింది. చిరంజీవి చేసిన మూడు పాత్రల ప్రయోగం సరైన ఫలితాన్ని ఇవ్వలేదు. దాంతో మళ్ళీ త్రిపాత్రాభినయం జోలికి వెళ్లలేదు చిరంజీవి.
డ్యూయర్ రోల్ సినిమాలు చాలా చేశాడు మెగాస్టార్.. అందులో దాదాపు చాలా సినిమాలు సక్సెస్ అయ్యియి. ఇక తనకు వర్కౌట్ అవ్వని ట్రిపుల్ రోల్ ను మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఛాలెంజ్ గా తీసుక న్నట్టు తెలుస్తోంది. రికార్డ్స్ బ్రేక్ అయ్యేలా సినిమాను ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
శంకర్ తో రామ్ చరణ్ తెరకెక్కిస్తున్న సినిమాలో హీరో.. ట్రిపుల్ రోల్ లో కనిపించబోతున్నట్టు సమాచారం. ఇందులో తండ్రీ ఇద్దరు కొడుకులుగా రామ్ చరణ్ కనిపిస్తాడ. అందులో ఒక పాత్ర నెగిటీవ్ రోల్ అయ్యి ఉంటుంది అని తెలుస్తోంది. ఈ సినిమాతో చరణ్, శంకర్ ఇద్దరు పెద్ద సాహసమే చేస్తున్నారు అనుకోవచ్చు.
ప్రస్తుతం పరిస్థితుల్లో.. రామ్ చరణ్ కు, శంకర్ కు హిట్ చాలా అవసరం. రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ తో పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొట్టాడు. ఆతరువాత ఆచార్యతో భారీ నిరాశ ఎదురయ్యింది చరణ్ కు .. దాంతో ఇప్పుడు భారీ హిట్ చాలా అవసరం చరణ్ కు. ఈ టైమ్ లోనే ట్రిపుల్ రోల్ తో ప్రయోగం చేస్తున్నాడు చరణ్. మరి శంకర్ పై చరణ్ కు అంత నమ్మకమేంటి..?
అటు శంకర్ కు కూడా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో హిట్ అవసరం.. ఈ మధ్య శంకర్ మ్యాజిక్ సరిగ్గా పని చేయడం లేదు. హీరోల దగ్గర నుంచి తనకు కావల్సింది గట్టిగా పిండుకుంటాడు శంకర్. అయినా ఒక్కోసారి శంకర్ కు నిరాశ తప్పడం లేదు. రీసెంట్ గా భారతీయుడు2 ఆగిపోయింది. గతంలో ఐ లాంటి సినిమాలు పెద్దగా వర్కైట్ అవ్వలేదు. ఈసారి మాత్రం గట్టిగా ప్లాన్ చేశాడట. తన మ్యాజిక్ ను రిపిట్ చేయాడానికి గట్టిగా ప్రిపేర్ అయ్యాడట శంకర్. శంకర్ కాన్ఫిడెంట్ పై చరణ్ కు నమ్మకం కలగడంతోనే ఈ ప్రయోగానికి సై అన్నట్టు సమాచారం.
దర్శకుడు శంకర్ సినిమాల్లో కథాంశాలపరంగా వైవిధ్యం, సామాజిక సందేశంతో పాటు హీరోల పాత్రల్ని భిన్న పార్శాల్లో ఆవిష్కరించడం కనిపిస్తుంది. ఈ ప్లానింగ్ తోనే పాన్ ఇండియా మూవీగా ఈ సినమాను తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతున్నది. తాజా షెడ్యూల్ విశాఖపట్నంలో మొదలైంది. మరి ట్రిపుల్ రోల్ తో తండ్రి సాధించలేని హిట్ కొడుకుగా రామ్ చరణ్ సాధించి చూపిస్తాడా లేదా అనేది చూడాలి.