వరస పెట్టి ఫన్ చిత్రాలు అందిస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ’ఎఫ్ 2’మూవీ ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే కదా. ఈ సినిమా 2019 సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించింది. చాలా కాలం తర్వాత వెంకటేష్‌లోని కామెడీ యాంగిల్ బయటికి తీసుకొచ్చిన సినిమా ఎఫ్ 2. అలాగే వరుణ్ తేజ్ కెరీర్‌లో కూడా ఇదే పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ సినిమా రూ. 130 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి నిర్మాత దిల్ రాజుకు మంచి లాభాలు తీసుకొచ్చింది.
ఎఫ్ 2 సినిమాకు ఎఫ్ 3 అంటూ సీక్వెల్ రెడీ అయిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డు చూసిన తర్వాత ఇప్పుడు ఎఫ్ 3 సినిమాపై అంచనాలు ఎలా ఉంటాయో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం సెకండాఫ్ లో వచ్చే ఓ ఎపిసోడ్ గురించి ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అది కనుక వర్కవుట్ అయితే సినిమా పెద్ద హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇంతకీ ఏమిటా ఎపిసోడ్..
వరసగా ఐదు విజయాల తర్వాత డబుల్ హ్యాట్రిక్ కోసం ఎఫ్ 3 సినిమా చేస్తున్నారు అనిల్ రావిపూడి. మంచి అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 27న విడుదలకానుంది. ఈ నేపధ్యంలో చిత్రం ప్రమోషన్స్ పెంచారు. ఈ నేఫధ్యంలో ఈ చిత్రం కథ గురించి రకరకాల కథనాలు వినపడుతున్నాయి. ఈ కథ అంతా కూడా డబ్బుకు సంబంధించిన ఫ్రస్ట్రేషన్ చుట్టూ తిరుగుతుంది. ఆ క్రమంలో ఫస్టాఫ్ లో హీరోలిద్దరూ డబ్బు కోసం రకరకాల స్కెచ్ లు వేస్తారు. హోటల్ పెడతారు. మరో బిజినెస్ పెడతారు..కానీ ఏదీ కలిసి రాదు.
F3 movie
మరో ప్రక్క భార్యల డబ్బు దాహం పెరిగిపోతుంది. ఈ క్రమంలో డబ్బు కోసం గుప్త నిథి తవ్వకం మొదలెడతారు హీరోలిద్దరూ. ఈ ఎపిసోడ్ సెకండాఫ్ వస్తుంది. వెంకటేష్ రేచీకటి, వరుణ్ తేజ్ నత్తితో బాధపడుతుంటారు. రాత్రిపూట నిధి తవ్వకానికి వెళ్లటం..అక్కడ వెంకీకు ఏమీ కనపడకపోవటం. మరో ప్రక్క అక్కడకు వచ్చే మరో బ్యాచ్..వాళ్లు వీళ్లను దెయ్యాలను కోవటం..వీళ్లు వాళ్లను దెయ్యాలనుకోవటం..వీటి మధ్యన ఫన్ జరుగుతుంది. ఇది థియోటర్ దద్దరిల్లే ఫన్ తో నిండిపోతుందని తెలుస్తోంది.
ఈ ఎపిసోడ్ దాదాపు ఓ ఇరవై ఐదు నిముషాలు ఉంటుందని అంటున్నారు. అది కనక వర్కవుట్ అయ్యిందా సినిమా బ్లాక్ బస్టర్ అంటున్నారు. చిత్రంలో హీరో క్యారెక్టర్స్ నుంచి ఫన్‌ను క్రియేట్ చేయటంతో పాటు డబ్బు, బంగారం అని ఆశపడే వారి భార్యల వల్ల హీరోలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారో తెలియజేసేలా F3 సినిమా ఉంటుందని అర్థమవుతుంది.
అలాగే చిత్రం ‘ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ”నేటి పరిస్థితి వందశాతం అవసరమైన సినిమా ఎఫ్ 3. దీనికి కారణం నవ్వు. ఒక మనిషి జీవితంలో నవ్వుకి ఎంత ప్రాధాన్యత వుందో చెప్పే సినిమా ఎఫ్ 3. సమాజంలో ఎన్ని సమస్యలు అన్నిటికి పరిష్కారం నవ్వు. నలఫై ఏళ్ళుగా నేను నమ్మింది ఇదే. ఎఫ్ 3 లో పాత్రలన్నీ నవ్వులు పంచుతాయి. ఈ క్రెడిట్ అంతా దర్శకుడు అనిల్ రావిపూడికి దక్కుతుంది. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది, ఈ సినిమా హిట్ కాకపొతే మళ్ళీ మీ ముందు ఎప్పుడూ నిలబడను”అన్నారు.
వెంకటేష్ మాట్లాడుతూ...త్వరగా డబ్బులు సంపాదించడం, పెద్ద కలలు కనడం, అవకాశాలు సృష్టించడం మానవుని సహజ లక్షణం. అందరికీ ఆశ వుంటుంది. ఈ క్రమంలో బోలెడు సమస్యలు ఎదురౌతాయి. బోలెడు పాఠాలు నేర్చుకుంటాం. ఆ పాఠాలతో మారుతాం. ఒకవేళ మారకపోతే .. మళ్ళీ అవే సమస్యల చట్టూ తిరగాల్సివుంటుంది. అన్నారు.
వెంకీ కంటిన్యూ చేస్తూ...ఎఫ్ 3లో మోర్ ఫన్ యాడ్ అయ్యింది. చాలా మంది నటులు యాడ్ అయ్యారు. సినిమా చాలా లావిష్ గా తీశాం. చాలా మంచి సీక్వెన్స్ లు వున్నాయి. ఎఫ్ 2కి మించిన ఫన్ ఎఫ్ 3 లో వుంది అన్నారు.
f3
ఈ సినిమాలో తమన్నా, మెహరీన్ హీరోయిన్స్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా మూవీలో ఫన్ డోస్‌ను మరింత పెంచారు. అందులో భాగంగా రాజేంద్ర ప్రసాద్, సునీల్‌లతో పాటు సోనాల్ చౌహాన్ ఓ కీలక పాత్రలో నటింప చేస్తున్నారు. అలాగే స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఇందులో ఓ స్పెషల్ సాంగ్ చేయడం విశేషం
ఇక ఎఫ్ 3 మూవీ టికెట్ ధరల పెంపుపై ఆసక్తి నెలకొంది. అయితే ఇటీవల స్టార్ హీరోల సినిమాలకు కొద్ది రోజుల పాటు టికెట్ ధరలు పెంచిన విషయం విధితమే. దీంతో తాజాగా ఎఫ్ 3కి కూడా టికెట్ ధరలు పెంచుతారా? అని అంతా చర్చించుకుంటున్న నేపథ్యంలో టికెట్ రేట్స్ పెంపుపై క్లారిటీ ఇచ్చాడు మూవీ నిర్మాత దిల్ రాజు. ‘ఎఫ్ 3 చిత్రానికి టికెట్ ధరలు పెంచడం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే మా సినిమాను మీ ముందుకు తెస్తున్నాం’ అని దిల్ రాజు వెల్లడించారు.