అంబానీల పెళ్లిలో రాంచరణ్ ...వైట్ ఆండ్ వైట్ పట్టుబట్టల్లో మస్తున్నాడు..!!

Published : Jul 12, 2024, 11:24 PM IST

 అనంత్ అంబాని, రాధిక మర్చంట్ వివాహం అంగరంగవైభవంగా జరుగుతోంది. దేశంలోని వ్యాపార, రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు విదేశాలకు చెందిన ప్రముఖులు సైతం ఈ పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. 

PREV
17
అంబానీల పెళ్లిలో రాంచరణ్ ...వైట్ ఆండ్ వైట్ పట్టుబట్టల్లో మస్తున్నాడు..!!
anant ambani radhika merchant Wedding

Anant Ambani Radhika Merchant Wedding : వ్యాపార దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి భాజా మోగింది. ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబాని తాను ఇష్టపడ్డ రాధికా మర్చంట్ ను పెళ్లాడాడు. ఈ జంట ఇవాళ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. 

27
anant ambani radhika merchant Wedding

ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో అంబాని అంతస్తుకు తగ్గట్లుగానే అత్యంత వైభవంగా పెళ్లి జరిగింది. రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులతో పాటు ఇతర రంగాలకు చెందిన జాతీయ, అంతర్జాతీయ స్థాయి అతిథులు ఈ పెళ్లికి హాజరయ్యారు. అయితే అనంత్, రాధిక పెళ్ళిలో సినీ తారలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 
 

37
anant ambani radhika merchant Wedding

బాలీవుడ్ నటీనటులతో పాటు సౌత్ స్టార్స్ అనంత్, రాధిక పెళ్ళిలో మెరిసారు. ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారిన మెగాస్టార్ తనయుడు రాంచరణ్ తేజ్ ఈ పెళ్లికి హాజరయ్యారు. భార్య ఉపాసనతో కలిసి చాలా సింపుల్ లుక్ లో దర్శనమిచ్చారు రాంచరణ్. ఇలా రాంచరణ్, ఉపాసన దంపతులు అంబానీల పెళ్లితో సరికొత్తగా కనిపించారు.

47
Anant Ambani Radhika Merchant Wedding

మరోవైపు లేడీ సూపర్ స్టార్ నయనతార భర్త విఘ్నేశ్ శివన్ తో కలిసి పెళ్ళికి హాజరయ్యారు. నయనతార బంగారు రంగు చీరలో మెరిసిపోయారు. ఆమె భర్త విఘ్నేశ్ కూడా అచ్చ తమిళ్ స్టైల్ లుంగీలో వచ్చారు. ఈ చూడముచ్చటైన జంట అంబానీల పెళ్లిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 

57
Anant Ambani Radhika Merchant Wedding

ఇక బాలీవుడ్ స్టార్స్ షారుఖ్, సల్మాన్, రణ్ బీర్ తదితర తారాగనమంతా కుటుంబసమమేతంగా అంబానీల పెళ్లికి వచ్చారు. ఇలా రాణీ ముఖర్జీ కూడా సాంప్రదాయబద్దంగా చీరకట్టులో హాజరయ్యారు. ఇక మిగతా సినీనటులు కూడా ట్రెడిషన్ లుక్ లో కనిపించారు. 

67
Anant Ambani Radhika Merchant Wedding

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సతీసమేతంగా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లికి హాజరయ్యారు. షేర్వానీలో ఆయన లుక్ అదిరింది.  

77
Venkatesh

ఫ్యామిలీ స్టార్ వెంకటేశ్ కూడా అంబానీల ఇంట పెళ్లికి వెళ్లారు. ఆయనతో పాటు రానా దగ్గుబాాటి కూడా భార్య మిహికతో కలిసి ఈ పెళ్లికి హారజయ్యారు. 

click me!

Recommended Stories