కంప్లీట్ యాక్టర్‌గా పేరుతెచ్చుకున్నారు మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్. సెటిల్డ్ యాక్టింగ్‌తో ఆకట్టుకోవడంలో ఆయన దిట్ట. జస్ట్ కళ్లతోనే నటించడంలోనూ ఆయనకు ఆయనే సాటి. దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా ఆయన కేరళా సినిమాకే కాదు, భారతీయ సినిమాకి చేస్తోన్న సేవలకుగానూ కేంద్రప్రభుత్వం అత్యున్నత పురస్కారంతో గౌరవించబోతుంది. ఆయన్ని 2023 ఏడాదికిగానూ ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపిక చేసింది. మరో రెండు రోజుల్లో ఈ పురస్కారాన్ని ఆయన అందుకోబోతున్నారు.
25
ఇటీవల `కన్నప్ప`లో నటించిన మోహన్ లాల్
ఈ సందర్భంగా మోహన్ లాల్ తెలుగులో నటించిన సినిమాల గురించి చూస్తే, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ఇప్పటి వరకు స్ట్రెయిట్‌గా నాలుగు తెలుగు సినిమాలు చేశారు. ఒక మూవీలో ఆయనే హీరో. మరో రెండు సినిమాలు ఇతర సూపర్ స్టార్స్ తో కలిసి నటించారు. ఇంకో చిత్రంలో జస్ట్ పాటలో మెరిశారు. అయితే వీటిలో ఒక్కటే బ్లాక్ బస్టర్. ఇటీవల మోహన్ లాల్ ఇటీవల `కన్నప్ప` చిత్రంలో మెరిసిన విషయం తెలిసిందే. మంచు విష్ణు హీరోగా, మోహన్ బాబు నిర్మించిన చిత్రమిది. ప్రభాస్, అక్షయ్, కాజల్ వంటి వారు గెస్ట్ రోల్ చేశారు. ఇందులో శివుడికి మరో రూపం అయిన కిరాట పాత్రలో కనిపించారు. కాసేపు మెరిసి వాహ్ అనిపించారు.
35
`జనతా గ్యారేజ్`మూవీతో హిట్ అందుకున్న మోహన్ లాల్
అయితే దీనికంటే ముందే మరో రెండు సినిమాలు చేశారు. అందులో ఒకటి `జనతా గ్యారేజ్`. ఎన్టీఆర్ హీరోగా రూపొందిన చిత్రమిది. దీనికి కొరటాల శివ దర్శకుడు. ఈ చిత్రంలో సత్యం అనే గ్యాంగ్ స్టర్ తరహా పాత్రలో మెరిశారు. అన్యాయాలు, అక్రమాలు చేసేవారి అంతుచూసే పాత్ర. అదే సమయంలో ఆపదలో ఉన్న వారిని ఆదుకునే పాత్ర. అందులో అంతే బాగా నటించి ఎన్టీఆర్ ని డామినేట్ చేశారు. ఇందులో సమంత, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటించారు. 2016లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
ఇంకోవైపు అదే ఏడాది `మనమంతా` అనే సినిమాలో హీరోగా చేశారు. ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. నలుగురి జీవితాలను ఆవిష్కరించే చిత్రం. తండ్రి, భార్య, కొడుకు, కూతురు ఇలా నలుగురు లైఫ్‌ని విడివిడిగా చూపించి చివరికి కలిపే తీరు బాగుంటుంది. దీనికి చంద్రశేఖర్ ఏలేటి దర్శకుడు. విమర్శకుల ప్రశంసలందుకున్న ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ఆదరణ పొందలేకపోయింది.
అంతకు ముందు బాలయ్య, ఏఎన్నార్ కోసం ఓ గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చారు. 1994లో ఏఎన్నార్, బాలకృష్ణ కలిసి `గాంఢీవం` చిత్రంలో నటించారు. ప్రియదర్శన్ దర్శకుడు. గ్యాంగ్ స్టర్ ప్రధానంగా సాగే యాక్షన్ కామెడీ చిత్రమిది. ఇందులో రోజా హీరోయిన్. ఈ మూవీలో ఓ పాటలో బోట్ మ్యాన్‌గా మోహన్ లాల్ నటించారు. కాసేపు అలా మెరిసి వాహ్ అనిపించారు. ఇలా ఈ నాలుగు చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ ని అలరించారు మోహన్‌లాల్. అయితే తాను మలయాళంలో, ఇతర భాషల్లో నటించిన సూపర్ హిట్ మూవీస్ తెలుగులో డబ్ అవుతున్నాయి. దీంతో అలా కూడా ఆయన తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యారు. `మన్యంపులి` మూవీ ఇక్కడ కూడా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. అలాగే `లూసీఫర్`, `జైలర్` మూవీ బాగానే ఆదరణపొందింది. అప్పట్లో `ఇద్దరు` మూవీ కూడా విశేషంగా ఆకట్టుకుంది.