Ram Charan కొడుకు ఎన్ని వేల కోట్లకు వారసుడో తెలుసా? ఇండియాలోనే రిచ్చెస్ట్ స్టార్ కిడ్‌

Published : Feb 02, 2026, 09:14 AM IST

రామ్‌ చరణ్‌, ఉపాసన ట్విన్స్ కి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. చిరంజీవి కుటుంబంలోకి రెండో తరం వారసుడు వచ్చాడు. అయితే ఈ చిన్నారి ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ కిడ్‌గా చెబుతున్నారు. 

PREV
15
చిరంజీవి ఫ్యామిలీలోకి వారసుడు వచ్చాడు

మెగాస్టార్ చిరంజీవి తన వారసత్వాన్ని కొనసాగించడానికి వారసుడు వచ్చాడు. రామ్‌ చరణ్‌, ఉపాసనకు శనివారం రాత్రి ట్విన్స్ జన్మించిన విషయం తెలిసిందే. కుమారుడు, కుమార్తె జన్మించారు. వీరికి మూడేళ్ల క్రితమే కూతురు క్లీంకార జన్మించింది. ఇప్పుడు ట్విన్స్ రావడంతో కొణిదెల ఫ్యామిలీ ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు. సాధారణంగా ట్విన్స్ జన్మించడమే గొప్పగా భావిస్తుంటారు. అలాంటి తమ వారసత్వాన్ని కొనసాగించే అబ్బాయి కూడా రావడం వారి ఆనందాన్ని రెట్టింపు చేసింది.

25
ఇండియాలోనే రిచ్చెస్ట్ కిడ్‌గా రామ్‌ చరణ్‌ కొడుకు

 ఇప్పుడు రామ్‌ చరణ్‌ కొడుకు గురించి ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఆయన రిచ్చెస్ట్ కిడ్‌గా చెబుతున్నారు. ఇండియాలోనే అత్యంత సంపన్నమైన కిడ్‌గా రామ్‌ చరణ్‌ కొడుకు నిలవబోతున్నారట. దీనికి సంబంధించిన లాజిక్కులు, లెక్కలు తీస్తున్నారు అభిమానులు, నెటిజన్లు. సాధారణంగా మన ఇండియన్‌ ఫ్యామిలీస్‌లో అబ్బాయినే వారసుడిగా పరిగణిస్తారు. అమ్మాయిలు తమతో ఉండరు, మ్యారేజ్‌ చేసుకొని అత్తారింటికి వెళ్లిపోతారు. ఎన్ని రోజులున్నా, ఎంత కాలం మారినా, మన ఇండియాలో ఉన్న ఒక సాంప్రదాయం ఇది. ఆ విషయాలను పరిగణలోకి తీసుకున్నప్పుడు రామ్‌ చరణ్‌ కొడుకు కొణిదెల ఫ్యామిలీకి, ఆస్తులకు వారసుడు అవుతాడు.

35
చిరంజీవి, రామ్‌ చరణ్‌ ఆస్తులు

ప్రస్తుతం చిరంజీవికి ఉన్న ఆస్తుల విలువ రూ.1650కోట్లు అంటూ ప్రచారం జరుగుతుంది. సోషల్‌ మీడియాలో పలువురు అంచనా వేస్తున్నారు. అలాగే రామ్‌ చరణ్‌కి రూ.1350కోట్ల వరకు ఆస్తులుంటాయని సమాచారం. ఇద్దరి ఆస్తులు కలిపితే సుమారు రూ. 3 వేల కోట్ల వరకు ఉంటుంది. ఇందులో ఆడపిల్లలకు కొంత ఆస్తులు పంచినా వీరి ఆస్తులు రూ.2500కోట్ల వరకు ఉంటాయని అంచనా.

45
రామ్‌ చరణ్‌ కొడుకు ఆస్తులు

అదే సమయంలో ఉపాసన ఆస్తులు వేలకోట్లల్లో ఉన్నాయి. ఆమె సొంత ఆస్తులు రూ.1300కోట్ల వరకు ఉంటుందని అంచనా. అయితే అపోలో హాస్పిటల్స్ గ్రూప్‌ కామినేని ఫ్యామిలీదే. వీరి వ్యాపారాల విలువ రూ.77వేల కోట్లు ఉంటుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చర్చకు వచ్చింది. కామినేని ఫ్యామిలీలో అబ్బాయిలు లేరని సమాచారం. ఈ లెక్కన ఉపాసనకి వారసత్వంగా కొంత ఆస్తి వస్తుంది. అది సుమారు రూ.10000-15000కోట్ల వరకు రావచ్చని అంచనా. అదే జరిగితే ఆమె ఆస్తులు రూ.16000కోట్లకుపైగానే ఉంటాయి. ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఆస్తులు, ఉపాసన ఆస్తులు కలిపితే రూ.18000కోట్లకుపైగా ఉంటుందని చెప్పొచ్చు. ఇవన్నీ చరణ్‌, ఉపాసన కొడుక్కి చెందుతాయి. ఇదే నిజమైతే ఇండియాలోనే రిచ్చెస్ట్ కిడ్‌గా రామ్‌ చరణ్‌ కొడుకు నిలుస్తాడని చెప్పొచ్చు.

(నోట్‌: ఈ ఆస్తుల వివరాలు సోషల్‌ మీడియాలో ప్రచారంలో ఉన్న సమాచారం మాత్రమే. అభిమానుల ఆసక్తి మేరకు అందిస్తున్నాం. ఇదే నిజం అని ఏసియానెట్‌ ధృవీకరించడం లేదు)

55
`పెద్ది`తో రాబోతున్న రామ్‌ చరణ్‌, బాబీతో చిరంజీవి సినిమా

ఇక రామ్‌ చరణ్‌ ప్రస్తుతం `పెద్ది` సినిమాలో నటిస్తున్నారు. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 1న విడుదల కానున్నట్టు సమాచారం. ఇక చిరంజీవి ఈ సంక్రాంతికి `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీతో విజయాన్ని అందుకున్నారు. త్వరలో బాబీతో మూవీని స్టార్ట్ చేయబోతున్నారు. ఆయన నటించిన `విశ్వంభర` జులైలో రిలీజ్‌ కానుందని సమాచారం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories