రామ్ చరణ్ 'లిప్‌లాక్ సీన్స్‌' కు నో చెప్పడం వెనుక అసలు కథేమిటి?

First Published | Nov 14, 2024, 6:21 PM IST

రామ్ చరణ్ తన సినిమాల్లో లిప్‌లాక్ సీన్స్ చేయకపోవడం వెనుక ఆసక్తికరమైన కారణం ఉంది. 'రచ్చ' సినిమా సమయంలోనే ఈ నిర్ణయం తీసుకున్న చరణ్, ట్రెండ్‌ను పట్టించుకోకుండా తన మనసుకు నచ్చినట్లు నడుచుకుంటున్నారు. అయితే, 'రంగస్థలం' సినిమాలో మాత్రం కథానుసారం లిప్‌లాక్ సీన్ చేయాల్సి వచ్చింది.

#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani


  ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్​లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ మూవీ ఓ వైపు శరవేగంగా చిత్రీకరణ పనులు జరుపుకుంటూనే మరోవైపు ప్రమోషన్స్​తోనూ నెట్టిటం సందడి చేస్తోంది. ఇటీవలే టీజర్ లాంఛ్​ ఈవెంట్​ కూడా గ్రాండ్​గా జరిగి అభిమానులను తెగ ఆకట్టుకుంది.  

ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. కాలేజీ స్టూడింట్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్‌గా మారిన రామ్ చరణ్ విలన్‌లను ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఈ సినిమా కథగా చూపించనున్నట్లు అర్థమవుతోంది. మరో పాత్రలో చరణ్ రైతు నాయకుడిగా కనిపించనున్నారు. ఈ సినిమాలో ఓ సీన్ కు రామ్ చరణ్ నో చెప్పేసారట. అదేంటో చూద్దాం. దాని వెనక కథా తెలుసుకుందాం. 

#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani


  ప్రస్తుతం ఉన్న చిన్నా, పెద్ద సినిమాల్లో  ట్రెండ్ ఏమిటంటే... లిప్ లాక్ కిస్..అదేనండీ  పెదవి ముద్దు సీన్లు చాలా కామన్ అయిపోయింది. ఇలాంటి సన్నివేశాలను 'హీరోలు, హీరోయిన్లు చాలా హుషారుగా చేసేస్తున్నారు.

ఇలాంటి 'సన్నివేశాలుంటే కాసులు బాగా రాలతాయని గ్రహించిన నిర్మాతలు తాము నిర్మించే సినిమాల్లో లిప్ లాక్  సన్నివేశాలు ఉండేలా చూసుకుంటున్నారు. అయితే అందరు హీరోలు ఇందుకు ఇష్టపడరు. అలాంటి వారిలో రామ్ చరణ్ ఒకరు.


#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani


'ట్రెండ్ ఏదైనా కానీ ఈ లిప్ లాక్  సీన్లుకు నేను దూరం అంటున్నాడు యగ్  హీరో రామ్ చరణ్. అసలు ఈ డెసిషన్ ఎప్పుడు తీసుకున్నాడు అంటే..అప్పట్లో రామ్ చరణ్ హీరోగా సంపత్ నంది  దర్శకత్వంలో రూపొందిన  'రచ్చ' చిత్రం షూటింగ్ టైమ్ లో. సూపర్ హిట్ అయిన ఈ సినిమాలో హీరోయిన్ తో  ఓ లిప్ లాక్ సీను ఉందట. సెకండాఫ్ లో ఓ కీలకమైన టైమ్ వస్తుంది ఆ సీన్. ఈ సీను గురించి దర్శకుడు రామ్ చరణ్ తో చర్చలు జరిపాడట. 

#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani


కానీ ఈ లిప్ లాక్  సీను అవసరంలేదని, "కాబట్టి ఈ సీను నేను చేయనని ఖరాఖండిగా చెప్పేసాడట రామ్ చరణ్. ఈ సినిమాలోనే కాదు.. అతను ' నటించిన 'ఎవడు' సినిమాలో కూడా ఓ లిప్ లాక్ సీను ఉందట.

దీనికి కూడా నో చెప్పేసి ఆ సీన్ తీయించేసాడట. లిప్ లాక్  'సీన్లు వల్ల సినిమా ఆడుతుందనుకోవడం ట్రాష్ అని, కాబట్టి 'అలాంటి సీన్లు నేను చేయనని అన్నాడట రామ్ చరణ్. అప్పటి నుంచి ఇదే అమలు చేస్తూ వచ్చారట. 

#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani


అసలు ఇదంతా కాదు... అప్పటికే ఉపాసనతో తన ఎంగేజ్మెంట్ అయింది కాబట్టి  రామ్ చరణ్ ఆమెను బాధ పెట్టే విధంగా 'నడుచుకోకూడదని నిర్ణయించుకున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి.. ఆ విషయం డైరెక్ట్ గా  చెప్పలేక తెరపై హీరోయిన్లతో ముద్దు సీన్లు చేయడానికి నిరాకరిస్తున్నాడని పరిశ్రమ వర్గాలు అన్నాయి.

ఇప్పుడు పెళ్లై ఇంతకాలం అయ్యింది కాబట్టి ఇప్పుడు అసలు వాటి జోలికే పోవటం లేదు రామ్ చరణ్. కానీ రంగస్దలం సినిమాలో సమంతతో లిప్ లాక్ లాంటి సీన్ చేయకతప్పలేదు. డైరక్టర్ సుకుమార్ ..ఆ సీన్ సినిమాలో తప్పనిసరి అని చెప్పి ఒప్పించారట. తాజాగా గేమ్ ఛేంజర్ సినిమలోనూ అలాంటి సన్నివేసం ఉంటే సున్నితంగా నో చెప్పారట.

read more: `దేశముదురు` సినిమాని చేయాల్సింది ఏ హీరో తెలుసా? సూపర్‌ స్టార్‌ కావాల్సింది, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ అయ్యాడు!

Latest Videos

click me!