ఒక దశకు వచ్చాక జగపతిబాబు కెరీర్ తిరోగమనమైంది. ఆయన సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. దానికి తోడు ఆర్థిక కష్టాలు. దానధర్మాలు, ఖర్చులు, నమ్మిన వారు మోసం చేయడం వంటి కారణాలతో జగపతిబాబు దివాళా తీశాడు. డబ్బుల కోసం వచ్చిన ప్రతి సినిమా చేసుకుంటూ పోయాడు. కొన్నాళ్ళకు ఆఫర్స్ ఆగిపోయాయి. దిక్కు తోచని స్థితికి చేరుకున్నారు.
తన ఇంటిని కూడా జగపతిబాబు అమ్మేశారు. ఎంతో ఇష్టపడి కట్టించుకున్న ఇల్లు వదులుకోవాల్సి వచ్చింది. అయితే ఇల్లు అమ్ముకున్నందుకు తను ఏ విధంగా బాధపడలేదట. ఇళ్ళు, కార్ల మీద మమకారం పెంచుకుంటే అది జీవితమే కాదు. మనం మన కోసం బ్రతుకుతున్నట్లు కాదని జగపతిబాబు అన్నారు. రమేష్ అనే ఓ వ్యక్తికి తన ఇంటిని అమ్మేశాడట. కుటుంబ సభ్యులు కూడా తనను ప్రశ్నించలేదట.