`దేశముదురు` సినిమాని చేయాల్సింది ఏ హీరో తెలుసా? సూపర్‌ స్టార్‌ కావాల్సింది, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ అయ్యాడు!

First Published | Nov 14, 2024, 5:27 PM IST

అల్లు అర్జున్‌ హీరోగా రూపొందిన `దేశముదురు` సినిమా పెద్ద హిట్‌ సాధించింది. బన్నీకి మాస్ హీరోగా నిలబెట్టింది. కానీ ఈ కథ మొదట వేరే హీరో వద్దకు వెళ్లిందట. 
 

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ని మాస్‌ హీరోగా నిలబెట్టిన మూవీ `దేశముదురు`. `ఆర్య`తో హిట్‌ అందుకుని ఒక్కసారిగా అందరి చూపు తనవైపు తిప్పుకున్నాడు బన్నీ. ఆ తర్వాత `బన్నీ` వంటి మాస్‌ హిట్‌ పడింది. ఈ మూవీతో లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ నుంచి మాస్‌ ఇమేజ్‌కి టర్న్ తీసుకున్నాడు. ఆ వెంటనే `హ్యాపీ`తో డిజాస్టర్‌ పడింది. దాన్నుంచి కోలుకునేలా చేసింది `దేశముదురు` సినిమా. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయ్యింది. ఆ ఏడాదిలో బిగ్గెస్ట్ హిట్‌ చిత్రాల్లో మొదటి స్థానంలో నిలిచింది. ఇందులో హన్సిక బన్నీకి జోడీగా నటించగా, ఈ చిత్రంతోనే తెలుగుకి హీరోయిన్‌గా పరిచయం అయ్యింది హన్సిక. హీరోయిన్‌గా మారింది కూడా ఇదే సినిమా. `దేశ ముదురు` కుర్రాళ్లలోనూ చాలా ప్రభావం చూపించడం విశేషం. ఏ హీరో అయినా పూరీ జగన్నాథ్‌ చేతిలో పడితే మాస్‌ హీరోగా నిలబడతాడనే కామెంట్ ఉంది. దాన్ని బన్నీ విషయంలో నిజం చేసిన సినిమాగా చెప్పొచ్చు. 
 


అయితే ఈ మూవీలో హీరో మొదట అల్లు అర్జున్‌ కాదు. అక్కినేని హీరో అనుకున్నారు. సుమంత్‌ వద్దకు ఈ స్క్రిప్ట్ వెళ్లింది. పూరీ జగన్నాథ్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కలిసి సుమంత్‌ని అప్రోచ్ అయి ఈ కథ చెప్పారు. కానీ దీన్ని ఆయన రిజెక్ట్ చేశారు. కథ నచ్చలేదని, ప్రధానంగా ఈ పాయింట్‌లో మోరాలిటీ లేదని, తాను చేయనని చెప్పేశాడట. చాలా కన్విన్స్ చేసినా వినలేదు. పూరీ మాత్రమే కాదు, త్రివిక్రమ్‌ కూడా చాలా చెప్పి చూశారు, కానీ సుమంత్‌ ఎవరి మాట వినలేదు. దీంతో ఆయన్నుంచి సినిమా వెళ్లిపోయింది. 

సుమంత్‌ రిజెక్ట్ చేసిన ఈ సినిమాని అల్లు అర్జున్‌ ఓకే చేశారు. మాస్‌ ఎలిమెంట్లు నచ్చి ఓకే చెప్పారు. అలాగే లవ్‌ ట్రాక్‌ కూడా కొత్తగా ఉండటంతో క్రేజీగా ఉంటుందని భావించి బన్నీ ఓకే చెప్పారు. ఇందులో బన్నీని వేరే రేంజ్‌లో చూపించారు పూరీ జగన్నాథ్‌. 2007 జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బ్లాక్‌ బస్టర్ అయ్యింది. అల్లు అర్జున్‌ మాస్‌ హీరోగా నిలబడ్డాడు. స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. ఇక ఆయనకు తిరుగులేదు అనేంతటి విజయం ఈ సినిమా ద్వారా దక్కడం విశేషం. 

అయితే ఈ మూవీని సుమంత్‌ రిజెక్ట్ చేయడానికి కారణాలు చూస్తే స్క్రిప్ట్ నచ్చలేదట. తనుకు చెప్పిప్పుడు అది కేవలం ఫస్ట్ వర్షన్‌లోనే ఉందని, స్క్రిప్ట్ ఫైనల్ కాలేదని, జస్ట్ ఫస్ట్ వెర్షన్‌ చెప్పారు. సన్యాసిగా ఉన్న హీరోయిన్‌ వద్దకు వెళ్లి ఆమెని డిస్టర్బ్ చేయడం, లవ్‌ ప్రపోజ్‌ చేయడం అనే ఎలిమెంట్లు సుమంత్‌కి నచ్చలేదట.

అందులో నైతికత లేదని భావించాడట సుమంత్‌. అందుకే నో చెప్పాడట. కానీ ఆ సినిమా చేసి ఉంటే సుమంత్‌ రేంజ్‌ మారిపోయేది. మాస్ హీరోగా నిలబడేవాడు. ఆ టైమ్‌లో ఆ సినిమా పడితే సుమంత్‌ ఇమేజ్‌, మార్కెట్‌ పెరిగేది, తన కథల రేంజ్‌ పెరిగేది. ఓవరాల్‌గా ఆయన హీరోగా నెక్ట్స్ లెవల్ కి వెళ్లేవాడు.

ఓ రకంగా సూపర్‌ స్టార్‌ అయ్యేంతటి రేంజ్‌ సుమంత్‌ది. కానీ చేతులారా మిస్‌ చేసుకున్నాడు. ఇప్పుడు హీరోగా కాదు కదా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా మారిపోయారు. ఇటీవల `సీతా రామమ్‌`, `సార్‌` చిత్రాల్లో ఆయన క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా చేసిన విషయం తెలిసిందే. సూపర్‌ స్టార్‌ కావాల్సింది క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ అయ్యాడు సుమంత్‌. 
 

అల్లు అర్జున్‌ ఈ సినిమా తర్వాత నాలుగైదు వరుసగా ఫ్లాపులు పడ్డాయి. అయినా ఆయన ఇమేజ్‌ ఇసుమంతు కూడా తగ్గలేదంటే ఈ మూవీ ఇచ్చిన హై ఏ రేంజ్‌లో ఉందో చెప్పొచ్చు. ఇక బన్నీ ప్రస్తుతం ఐకాన్‌ స్టార్‌గా రాణిస్తున్నారు. పాన్‌ ఇండియా చిత్రాలతో దుమ్ములేపుతున్నారు. `పుష్ప`తో పాన్‌ ఇండియా హీరో అయిపోయిన ఆయని ప్పుడు `పుష్ప 2`లో నటించారు. డిసెంబర్‌ 5న ఈ చిత్రం రాబోతుంది. 

Read more:సూర్య `కంగువా` మూవీ రివ్యూ, రేటింగ్

also read: ధనుష్‌ నటించిన రిలీజ్‌ కాని సినిమాల లిస్ట్, వామ్మో లెక్క పెద్దదే

Latest Videos

click me!