రాంచరణ్ ప్రస్తుతం పెద్ది చిత్రంలో నటిస్తున్నారు. రాంచరణ్ పర్సనల్ లైఫ్ పై గతంలో ఊహించని వార్తలు వచ్చినప్పుడు చిరంజీవి ఏం చేశారు అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం పెద్ది చిత్రంలో నటిస్తున్నారు. మార్చి 27న రిలీజ్ కావలసిన ఈ చిత్రం ఏప్రిల్ 30కి వాయిదా పడింది. మొత్తానికి పీక్ సమ్మర్ లోనే రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన రాంచరణ్ కి గేమ్ ఛేంజర్ రూపంలో ఎదురుదెబ్బ తప్పలేదు. ఇప్పుడు పెద్ది మూవీతో రాంచరణ్ పాన్ ఇండియా మార్కెట్ ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
25
చిరుతతో ఎంట్రీ
రాంచరణ్ చిరుత చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. రాంచరణ్ కి టాలీవుడ్ లోకి మంచి ఎంట్రీ లభించింది. ఈ మూవీలో నటిస్తున్న టైంలో రాంచరణ్ పర్సనల్ లైఫ్ గురించి పుకార్లు మొదలయ్యాయి.
35
తొలి దెబ్బ గట్టిగా తగిలింది
రాంచరణ్, హీరోయిన్ నేహా శర్మ మధ్య ఎఫైర్ నడుస్తోంది అంటూ గాసిప్స్ మొదలయ్యాయి. దీని గురించి రాంచరణ్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. రాంచరణ్ మాట్లాడుతూ గాసిప్స్ దెబ్బ తొలిసారి నాకు చిరుత చిత్రం సమయంలో గట్టిగా తగిలింది. హీరోయిన్ ని తీసుకుని తాను ఎక్కడికో టూర్ వెళ్లిపోయినట్లు పుకార్లు పుట్టించారు.
అవన్నీ అబద్దాలు అని నాకు తెలుసు. కానీ ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాలేదు అని రాంచరణ్ తెలిపారు. ఆ టైంలో అమ్మ నాన్న సపోర్ట్ ఇచ్చారు. ఇలాంటి పుకార్లు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఫీల్ అవ్వకు అని చెప్పారు. ఆ టైంలోనే ఉపాసనతో నా ఫ్రెండ్ షిప్ స్టార్ట్ అయింది.
55
ఉపాసనకు నిజం తెలుసు
బహుశా ఉపాసనకి నేనెంటో తెలుసు కాబట్టి ఆమెకి ఈ రూమర్స్ గురించి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి రాలేదు అని రాంచరణ్ తెలిపారు. నేహా శర్మ మాత్రం చిరుత తర్వాత ఎక్కువగా టాలీవుడ్ లో కనిపించలేదు.