సుకుమార్, రాంచరణ్, రెహమాన్ ఒక్కొక్కరు ఒక్కోలా.. బాబోయ్ బుచ్చిబాబుని లేపుతున్నారుగా

First Published Mar 20, 2024, 6:03 PM IST

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ప్రారంభానికి ముందే బాగా హైప్ పెంచుకున్న RC 16 చిత్రం నేడు గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది.

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ప్రారంభానికి ముందే బాగా హైప్ పెంచుకున్న RC 16 చిత్రం నేడు గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. రంగస్థలం లాగా రస్టిక్ నేచర్ తో ఆ చిత్రానికి పది రెట్లు గ్రాండ్ గా అబ్బురపరిచే సన్నివేశాలతో చాలా వైల్డ్ గా ఈ చిత్రం ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

అందుకే రాంచరణ్ అభిమానులు శంకర్ గేమ్ ఛేంజర్ కన్నా ఎక్కువగా బుచ్చిబాబు చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి ఇంతలా హైప్ రావడానికి కాస్టింగ్ కూడా ఒక కారణం. రాంచరణ్ కి జోడిగా అతిలోక సుందరి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. 

రెహమాన్ ని మ్యూజిక్ కోసం ఒప్పించడం ఏ డైరెక్టర్ కి అయినా అంత సులువు కాదు. కానీ బుచ్చిబాబు కన్విన్స్ చేయడంతో అంతా ఆశ్చర్యపోయారు. అదే సమయంలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇతర కాస్టింగ్ గురించి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. 

అయితే పూజా కార్యక్రమంలో ఒక్కొక్కరు బుచ్చిబాబుకి ఇచ్చిన ఎలివేషన్ చూస్తే బాబోయ్ అనాల్సిందే. సుకుమార్ మాటలని బట్టి చూస్తే బుచ్చిబాబు ఈ కథ పట్ల చాలా నమ్మకంతో ఉన్నట్లు అర్థం అవుతోంది. సుకుమార్ మాట్లాడుతూ రంగస్థలం చేసే సమయంలోనే బుచ్చిబాబు నాకు ఈ స్టోరీ లైన్ చెప్పాడు. హీరోగా ఎవరిని అనుకుంటున్నావు అని అడిగితే రాంచరణ్ అని అన్నాడు. రాంచరణ్.. నాకే ఇప్పటికి దొరికాడు.. లేదు రాంచరణ్ నే కావాలి అన్నాడు. సరే ఒకే అనుకున్నా. 

మ్యూజిక్ ఎవరు అని అడిగా.. ఏఆర్ రెహమాన్ అన్నాడు. నేను షాక్ అయ్యా అని సుకుమార్ తెలిపారు. వెళ్లి మాట్లాడాడు.. రెహమాన్ ని ఒప్పించాడు. ఆ తర్వాత హీరోయిన్ జాన్వీ కపూర్ అన్నాడు.. ఇలా ఈ చిత్రాన్ని బుచ్చిబాబు చాలా పెద్దగా ఆలోచిస్తున్నాడు. 

రెహమాన్ మాట్లాడుతూ.. బుచ్చిబాబులో సినిమా పట్ల మ్యాడ్ నెస్ ఉంది అని అన్నారు. రాంచరణ్ అయితే బుచ్చిబాబుని సినిమా పిచ్చోడిగా అభివర్ణించారు. ఇక శివరాజ్ కుమార్ పూజా కార్యక్రమానికి హాజరు కాలేదు కానీ ఓ ఇంటర్వ్యూలో రాంచరణ్, బుచ్చిబాబు చిత్రం గురించి మైండ్ బ్లోయింగ్ కామెంట్స్ చేశారు. బుచ్చిబాబు మొదట కలసినప్పుడు అరగంటలో కథ చెప్పేస్తా అన్నాడు. కానీ కథని వివరిస్తూ ఒకటిన్నర గంట గడచిపోయింది. నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 

అంతలా కథలో లీనమయ్యా. ఒక మనిషికి అసలు ఇంత ఇమాజినేషన్ ఎలా వస్తుంది.. ఈ కథని బుచ్చిబాబు ఎలా ఊహించగలిగాడు అనేది తలుచుకుంటుంటేనే షాకింగ్ గా ఉందని శివరాజ్ కుమార్ అన్నారు. ఇలా బుచ్చిబాబుని ఒక్కొక్కరు ఒక్కోలా ఎలివేషన్ ఇస్తూ లేపేస్తున్నారు. రెండవ చిత్రానికే బుచ్చిబాబుకి మైండ్ బ్లోయింగ్ క్రేజ్ వచ్చేసింది అని చెప్పాలి. RC 16 కనుక గ్రాండ్ సక్సెస్ అయితే బుచ్చిబాబు పాన్ ఇండియా డైరెక్టర్ గా కుంభస్థలాన్ని బద్దలు కొట్టినట్లే అని చెప్పొచ్చు. 

click me!