ఆ ఒక్క మాటతో దొరికిపోయిన రైతుబిడ్డ... పల్లవి ప్రశాంత్ ని ఏకిపారేస్తున్నారుగా!

First Published | Mar 20, 2024, 5:56 PM IST

బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ చేసిన పొలిటికల్ కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. నెటిజెన్స్ మనోడిని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందో చూద్దాం.. 
 

Pallavi Prashanth

బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ తరచుగా వార్తల్లో ఉంటున్నాడు. ఫినాలే రోజు అన్నపూర్ణ స్టూడియో ఎదుట జరిగిన అల్లర్ల కేసులో పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యాడు. రెండు రోజుల అనంతరం బెయిల్ పై విడుదలయ్యాడు. ఇది ఒక సెన్సేషన్ అయ్యింది. 
 

అలాగే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ గెలిస్తే ప్రైజ్ మనీ పేద రైతులకు సహాయం చేస్తానని హామీ ఇచ్చాడు. నెలలు గడుస్తున్నా పల్లవి ప్రశాంత్ డబ్బులు పంచలేదు. దాంతో అతడికి సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు ఎదురయ్యాయి. 


Pallavi Prashanth

ప్రాణం పోయినా మాట తప్పను అంటూ... ఇటీవల ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాడు. పేరెంట్స్ ని కోల్పోయిన ఇద్దరు చిన్నారులకు లక్ష రూపాయలతో పాటు ఒక ఏడాదికి సరిపడా బియ్యం దానం చేశాడు. ఇంకా పలువురికి సహాయం చేసి ఆ వీడియోలు పోస్ట్ చేస్తానని వెల్లడించాడు. 

Pallavi Prashanth

అయితే తనను సీఎం చేయాలని పల్లవి ప్రశాంత్ చేసిన కామెంట్స్ విపరీతంగా ట్రోల్స్ కి గురయ్యాయి. కప్ గెలిచాక పల్లవి ప్రశాంత్ ని పేద రైతులను ఎప్పుడు ఆడుకుంటున్నారు అని అడిగితే... నేను ఏమైనా సీఎంనా అన్నాడు. ఇదే విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో అడగం జరిగింది. 

నాకు వచ్చిన రూపాయి ఎంత మందికి దానం చేయగలను. 14 ఊళ్ల రైతులకు సహాయం చేయడం అంత సులువు కాదు. అందుకే నన్ను సీఎం చేయండి. రైతులందరినీ ఆదుకుంటాను, అన్నాను. అందులో తప్పేముందని పల్లవి ప్రశాంత్ వివరణ ఇచ్చుకున్నాడు. 

అయితే సీఎం పదవి విలువ నీకు తెలుసా? అంత తేలిగ్గా సీఎం చేయండని ఎలా అడుగుతావు? రాజకీయాలు అంటే రస్నా తాగడం అనుకున్నావా? అని పల్లవి ప్రశాంత్ ని నెటిజెన్స్ ఏకి పారేస్తున్నారు. అర్హత ఉన్నవాళ్లు ఎవరైనా సీఎం కావచ్చు. నాకు కావాలంటే ఎవరూ ఇవ్వరని, అది సాధించుకోవాలని ఎద్దేవా చేస్తున్నారు. 

ఇటీవల ఓ కార్యక్రమంలో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉన్నట్లు పల్లవి ప్రశాంత్ పరోక్షంగా మాట్లాడాడు. మీ సపోర్ట్ తో బిగ్ బాస్ టైటిల్ గెలిచాను. మీ ఆశీర్వాదం ఉంటే ఎన్నికల్లో కూడా పోటీ చేసి గెలుస్తానని అన్నాడు. తెలంగాణలో త్వరలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. పల్లవి ప్రశాంత్ మరి కంటెస్ట్ చేస్తాడేమో చూడాలి..

Latest Videos

click me!