instagram
ఇదిలా ఉంటే గతంలో తనపై బాడీ షేమింగ్ కామెంట్స్ వచ్చాయని పంచుకుంది మృణాల్. ఇప్పుడు మరోసారి ఆమె బరస్ట్ అయ్యింది. సోషల్ మీడియాలో హీరోయిన్లపై జరిగే ట్రోలింగ్, బాడీ పార్ట్స్ పై ట్రోలింగ్స్ పై రియాక్ట్ అయ్యింది.
instagram
తాజాగా ఆమె ఓ ఈవెంట్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. కొంత మంది హీరోయిన్లని వస్తువులా చూస్తున్నారని తెలిపింది. అంతేకాదు వారు హీరోయిన్ల నిర్దిష్ట భాగాలపై ఫోకస్ చేసి, వాటిని జూమ్ చేసి కామెంట్లు చేస్తున్నారు.
instagram
అంతేకాదు దాన్ని రకరకాలుగా మార్చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని వాపోయింది. వీటికి తాను కూడా అతీతం కాదని ఆమె చెప్పకనే చెప్పింది. అయితే ఇవన్నీ తమకు ఎంతో బాధ కలిగిస్తాయని చెప్పింది మృణాల్ ఠాకూర్.
instagram
గతంలోనూ ఆమె బాడీ షేమింగ్ ట్రోల్స్ పై రియాక్ట్ అయిన విషయం తెలిసిందే. తాను అస్సలు సెక్సీగా ఉండనని, పల్లెటూరి పిల్ల అని, బరువు తగ్గమని సలహాలిస్తుంటారని తెలిపింది. ఇలాంటి చాలా బాడీ షేమింగ్ కామెంట్లని, ట్రోల్స్ ని ఎదుర్కొంటున్నట్టు మృణాల్ వెల్లడించింది.
instagram
మృణాల్ ఠాకూర్ చాలా స్ట్రగుల్ పడి ఈ స్థాయికి వచ్చింది. డాక్టర్ కావాలనుకుంది. ఆ తర్వాత యాక్టర్ అయ్యింది. టీవీ నటిగా కెరీర్‌ని ప్రారంభించింది. అక్కడ నిలబడటం కష్టంగా మారింది. కెరీర్ పరంగా గ్రోత్ లేదు.
instagram
సినిమా అవకాశాలు ఇచ్చే వారు కాదట. టీవీ నటి సినిమాలకు పనికి రాదనే వారట. అలా ఆఫర్లు లేక చాలా కుంగిపోయినట్టు గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది మృణాల్. ఈ క్రమంలో బాలీవుడ్‌లో ఒక ఆఫర్ వచ్చిందని, ఆ తర్వాత నెమ్మదిగా చిన్నవి, పెద్దవి ఆఫర్లు వచ్చినట్టు తెలిపింది.
instagram
తెలుగులోకి ఈ భామ `సీతారామం` చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంది. దీంతో మృణాల్ కెరీర్ మారిపోయింది. పదేళ్ల స్ట్రగుల్ ఒక్క సినిమాతో పోయింది.దీంతో ఇప్పుడు తెలుగులో బిజీ హీరోయిన్ అయిపోయింది.
instagram
ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండతో `ఫ్యామిలీ స్టార్` చిత్రంలో నటిస్తుంది. ఇది ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా మంగళవారం ముంబయిలో అమెజాన్ ఈవెంట్‌లో మెరిసిందీ బ్యూటీ.
instagram
దీంతోపాటు `కల్కి2898ఏడీ`లో గెస్ట్ రోల్ చేస్తుందట. మరోవైపు ప్రభాస్‌తో కలిసి మరో సినిమా చేయబోతుందట. హను రాఘవపూడి సినిమాలో హీరోయిన్‌గా మృణాల్‌నే అనుకుంటున్నారని తెలుస్తుంది. దీంతోపాటు హిందీ, తమిళంలోనూ సినిమాలు చేస్తుంది మృణాల్.