‘పొన్నియిన్ సెల్వన్ 1’లోని ఆ సీన్ లో 5000 మంది ఉన్నారా? రియల్ క్రౌడ్ తో అదిరిపోయే షాట్.. డిటేయిల్స్..

First Published Sep 6, 2022, 2:11 PM IST

ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్ 1’ మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్ర అప్డేట్స్ కు అదిరే రెస్పాన్స్ వస్తోంది. తాజాగా మూవీలోని కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలు రివీల్ అయ్యాయి.
 

కోలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ ఫిల్మ్ ‘పొన్నియిన్ సెల్వన్ 1’ (Ponniyin Selvan 1). ఈ నెలాఖరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం (Mani Ratnam) తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా చిత్రాన్ని రూపొందించారు. కల్కి క్రిష్ణమూర్తి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’పుస్తకం ఆధారంగా చిత్రీకరించారు.
 

దక్షిణ భారతదేశాన్ని పాలించిన శక్తివంతమైన రాజు అరుల్మొళివర్మన్,  చోళ చక్రవర్తి కాలం నాటి కథను ప్రేక్షకులకు కండ్లకు కట్టినట్టు చూపించబోతున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి వచ్చిన పోస్టర్లు,  టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. మరోవైపు చిత్రంలోని భారీ యుద్ధ సన్నివేశాలు, సముద్రంలో ప్రయాణించే నౌకలకు సంబంధించిన షాట్స్ ఆకట్టుకుంటున్నాయి.
 

ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు నెట్టింట చక్కర్లు  కొడుతున్నాయి. మూవీలోని చాలా సన్నివేశాలను మణిరత్నం ఒరిజినల్ లోకేషన్లలోనే షూట్ చేశారంట. టీజర్ లో కనిపించే అద్భుతమైన కోటలు, ప్రాంతాల్లు ఇప్పటికీ ఉన్నాయని తెలుస్తోంది. మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే.. మూవీలో దాదాపు రియల్ క్రౌడ్ నే చూపించారంట.
 

ముఖ్యంగా ఓ కోట ముఖద్వారం వద్ద చోళరాజు ప్రజలను కలిసే సన్నివేశాన్ని 5000 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులతో రియల్ క్రౌడ్‌తో చిత్రీకరించారని తెలుస్తోంది. అది కూడా కోవిడ్ పరిస్థితిలో మణిరత్నం ధైర్యంగా, అన్ని నియమనిబంధనలు పాటిస్తూ తీశారంట. చిత్రంలో ఈ సీన్ అద్భుతంగా ఉంటుందని అంటున్నారు. 
 

ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’లో ఎస్ఎస్ రాజమౌళి ఫైట్ సీన్స్ లో 2000కు పైగా జూనియర్ ఆర్టిస్టులను చూపించిన విషయం తెలిసిందే.   ‘బాహుబలి’లోనూ కొన్ని యుద్ధ సన్నివేశాలకు రియల్ క్రౌడేనే చూపించారు. కానీ మణిరత్నం ఏకంగా 5000కు పైగా జూనియర్ ఆర్టిస్ట్ లను చూపిస్తూ సన్నివేశాన్ని చిత్రీకరించడంతో దాని తాలుకా విజువల్స్ అద్భుతంగా ఉంటాయని అంటున్నారు. 
 

ఇక ఈ రోజు చెన్నైలో నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ‘పొన్నియిన్ సెల్వన్’ ఆడియో లాంచ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఈ ఈవెంట్ కు తమిళ స్టార్ హీరోలు ఉలగనాయగన్ కమల్ హాసన్, తలైవా రజినీకాంత్ చీఫ్ గెస్ట్ లుగా హాజరవుతున్నారు. రూ.500 కోట్లతో  ప్రముఖ నిర్మాణ లైకా ప్రొడక్షన్, మద్రాస్ టాకీస్ సంస్థలు నిర్మించాయి. సెప్టెంబర్ 30న  తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
 

click me!