సుస్మితా సేన్‌-లలిత్ మోడీ బ్రేకప్‌.. రెండు నెలలకే డేటింగ్‌కి ముగింపు..? హాట్‌ టాపిక్‌

Published : Sep 06, 2022, 01:25 PM IST

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌, ఐపీఎస్‌ ఫౌండర్‌ లలిత్‌ మోడీ డేటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ఇద్దరు బ్రేకప్‌ చెప్పుకున్నారనే వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అవుతుంది.   

PREV
17
సుస్మితా సేన్‌-లలిత్ మోడీ బ్రేకప్‌.. రెండు నెలలకే డేటింగ్‌కి ముగింపు..? హాట్‌ టాపిక్‌

మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌, లలిత్‌ మోడీ డేటింగ్‌ చేస్తున్నట్టు రెండు నెలల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలోనే మ్యారేజ్‌ కూడా చేసుకోబోతున్నట్టు ప్రకటించారు. అప్పటికే మూడు నాలుగు సార్లు పెళ్లి వరకు వెళ్లి బ్రేకప్‌అయిన సుస్మితా సేన్‌ రిలేషన్‌ షిప్‌ ఈ సారైనా పెళ్లి వరకు వెళ్తుందా? అనే కామెంట్లు వచ్చాయి. ఫైనల్‌గా లలిత్‌ మోడీ వద్ద ఆగిన సుస్మితా సేన్‌అంటూ కామెంట్లు చక్కర్లు కొట్టాయి. 
 

27

డేటింగ్‌ ప్రకటించి మూడు నెలలు తిరగకముందే ఈ క్రేజీకపుల్‌ బ్రేకప్‌ చెప్పుకున్నారట. తాజాగా ఈ వార్త ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సుస్మితా సేన్‌తో లలిత్‌మోడీ బ్రేకప్‌ చెప్పాడంటూ కథనాలుప్రారంభమయ్యాయి. కారణంగా లలిత్‌ మోడీ తన సోషల్‌మీడియాలో అకౌంట్‌లో సుస్మితా సేన్‌ పేరుని తొలగించడమే.

37

డేటింగ్‌ ప్రకటించినప్పట్నుంచి ఇన్‌స్టాగ్రామ్‌ బయోలో `నా క్రైమ్‌ పార్టనర్‌`, `లవ్‌ సుస్మితా సేన్‌` అంటూ ఆమె పేరుని ట్యాగ్‌ చేసుకున్నారు లలిత్‌ మోడీ. కానీ ఇప్పుడు ఆమె పేరుని, ట్యాగ్‌లను తొలగించాడు. ఇదే వీరిద్దరి మధ్య చెడిందనే రూమర్స్ కి కారణమవుతుంది. తన అకౌంట్‌ నుంచి లలిత్‌ మోడీ ఆమె పేరుని తొలగించడంతో అభిమానుల, నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. 

47

డేటింగ్‌ ప్రకటించిన రెండు నెలలకే బ్రేకప్‌ అంటూ కామెట్లు చేస్తున్నారు. అప్పుడే అవసరం తీరిపోయిందా? అంటూ మీమ్స్ తో విరుచుకుపడుతున్నారు. ఇంత ఫాస్ట్ గా బ్రేకపా? అంటూ ఆశ్చర్యానికి వ్యక్తం చేస్తున్నారు. సుస్మితా సేన్‌ ప్రభుత్వం నియమించిన అండర్‌ కవర్‌ ఆపరేషన్‌ ఆఫీసర్‌ అని, ఆమె పని అయిపోయిందని, అందుకే వెనక్కి వెళ్లిపోయిందని సెటైర్లు పేలుస్తున్నారు. మొత్తంగా ఈ ఇద్దరు ముదురు ప్రేమికుల లవ్‌ స్టోరీకి ముగింపు పలికినట్టే అంటున్నారు. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

57

మాజీ విశ్వసుందరిగా రాణించిన సుస్మితా సేన్‌ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. బాలీవుడ్‌ని ఓఊపు ఊపేసింది. 20కి ముందు బాలీవుడ్‌ని సింగిల్‌గా ఏలిందని చెప్పొచ్చు. అదే సమయంలో ఆమె రిలేషన్‌షిప్స్ కూడా హాట్‌ టాపిక్‌ అయ్యాయి. ఆమె మొదట్లో పాక్‌ క్రికెటర్‌ వసీమ్ అక్రమ్‌తో లవ్‌ స్టోరీ నడిపించిన విషయం తెలిసిందే. కొన్నాళ్లకి బ్రేకప్‌ చెప్పింది. 
 

67

ఆ తర్వాత తనకంటే చిన్నవాడైన రోహ్‌ మన్‌తో ప్రేమలో పడింది. చాలా కాలం ఈ ఇద్దరు కలిసి తిరిగారు. సహజీవనం చేశారు. అనంతరం ఇటీవల లలిత్‌ మోడీతో డేటింగ్‌ ప్రకటించారు. అయితే అఫీషియల్‌గా వీరితో డేటింగ్‌ చేసిన సుస్మితా సేన్‌, అనధికారికంగా చాలా మందితో రిలేషన్స్ కొనసాగించిందనే గుసగుసలు బాలీవుడ్‌లో వినిపిస్తుంటాయి. 

77

ఇదిలా ఉంటే వ్యాపారవేత్తగా రాణించే లలిత్‌ మోడీ ఇండియన్‌ ఐపీఎల్‌ ని స్టార్ట్ చేసి సంచలనం సృష్టించింది. ఐపీఎల్‌ ఫౌండర్‌గా ఫేమస్‌ అయ్యారు. ఈ క్రమంలో మ్యాచ్‌ఫిక్స్ వంటి కొన్ని అక్రమాలకు పాల్పడ్డాడనే ఆరోపణలో దేశం విడిచి పారిపోయారు. చాలా కాలం ఇండియాకి, వార్తలకు దూరంగా ఉన్న ఆయన ఇటీవల సుస్మితా సేన్‌తో డేటింగ్‌ ప్రకటించి మళ్లీ వార్తల్లో నిలిచారు. ఇప్పుడు బ్రేకప్‌ వార్తలతో మరోసారి హాట్‌ టాపిక్‌గా మారారు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories