Ram Charan: రాంచరణ్ నటనపై విమర్శలు, వరస్ట్ నుంచి ది బెస్ట్ వరకు..నోరు మెదపకుండా 5 సినిమాలతో ఇచ్చిపడేశాడు

Published : Jun 04, 2026, 07:26 AM IST

కెరీర్ బిగినింగ్ లో రాంచరణ్ నటనపై విమర్శలు వచ్చాయి. కానీ విమర్శలని అధికమిస్తూ చరణ్ 5 సినిమాలతో సమాధానం ఇచ్చారు. పెద్ది చిత్రంలో రాంచరణ్ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. 

PREV
17
Ram Charan

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన పెద్ది చిత్రం గ్రాండ్ గా నేడు గురువారం రిలీజ్ అవుతోంది. ఆల్రెడీ ప్రీమియర్స్ నుంచి సూపర్ హిట్ టాక్ వచ్చేసింది. రాంచరణ్ నట విశ్వరూపం ప్రదర్శించాడు అంటూ ప్రేక్షకులు, క్రిటిక్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. రాంచరణ్ తన నటనపై ఓవర్ నైట్ లో ప్రశంసలు పొందలేదు. కెరీర్ బిగినింగ్ లో నటన పరంగా, లుక్స్ పరంగా ఎన్నో విమర్శలు ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. అన్నినింటినీ మౌనంగా రిసీవ్ చేసుకుంటూ తన టైం వచ్చినప్పుడు నటనతో జవాబు ఇచ్చారు. చిరుతతో మొదలైన రాంచరణ్ నటనా ప్రస్థానం పెద్ది సినిమాతో పీక్స్ కి చేరింది అని చెప్పొచ్చు

27
రాంచరణ్ పై విమర్శలు

కెరీర్ బిగినింగ్ లో రాంచరణ్ లుక్స్ పై ట్రోలింగ్ జరిగింది. తొలి చిత్రం చిరుత హిట్టయినప్పటికీ అది ఫక్తు కమర్షియల్ మూవీ. నటనకు పెద్దగా ఆస్కారం లేదు. జంజీర్( తెలుగులో తుఫాన్) చిత్రంతో రాంచరణ్ బాలీవుడ్ లో ఓ ప్రయత్నం చేశారు. అది అట్టర్ ఫ్లాప్ అయింది. జాతీయ స్థాయిలో రాంచరణ్ నటనపై విమర్శలు వచ్చాయి. అన్నింటినీ మౌనంగా ఎదుర్కొన్న చరణ్ 5 సినిమాలతో తానేంటో నిరూపించుకున్నారు. ఆ 5 సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

37
మగధీర

ఇది రాంచరణ్ 2వ చిత్రం. అప్పటికి టాలీవుడ్ లో అత్యధిక బడ్జెట్ లో ఈ చిత్రాన్ని రూపొందించారు. రికార్డులు తిరగరాసిన ఈ మూవీలో రాంచరణ్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అయితే ఈ మూవీలో ఎక్కువ భాగం క్రెడిట్ రాజమౌళి కే వెళ్ళింది.

47
ధ్రువ

ఫిజిక్, బాడీ లాంగ్వేజ్ పరంగా చరణ్ తనని తాను మార్చుకున్న మూవీ ఇది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాంచరణ్ స్టైలిష్ పెర్ఫార్మన్స్ ఆకట్టుకునేలా ఉంటుంది.

57
రంగస్థలం

విమర్శకులు, ట్రోలర్స్ ఎలాంటి వంకలు పెట్టడానికి వీల్లేకుండా రాంచరణ్ నటనతో అదరగొట్టారు. నటన పరంగా రాంచరణ్ కి తొలిసారి ప్రశంసలు తెచ్చిపెట్టిన మూవీ రంగస్థలం. ఇక్కడి నుంచే చరణ్ కెరీర్ కొత్త మలుపు తీసుకుంది.

67
ఆర్ఆర్ఆర్

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీలో రామరాజు పాత్రలో చరణ్ ఇచ్చిన పెర్ఫార్మెన్స్ ఇండియా వైడ్ గా సినీ ప్రేక్షకులని కట్టిపడేసింది. రాంచరణ్ కి ఈ చిత్రం పాన్ ఇండియా క్రేజ్ తీసుకువచ్చింది.

77
పెద్ది

తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్ది చిత్రంలో రాంచరణ్ నటనకు ఆడియన్స్ నీరాజనాలు పడుతున్నారు. తప్పకుండా చరణ్ కి నేషనల్ అవార్డు వస్తుంది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎమోషనల్ సీన్స్ లో చరణ్ కంటతడి పెట్టించాడని అంటున్నారు. ఇప్పటికే పెద్ది చిత్రానికి సూపర్ హిట్ టాక్ వచ్చేసింది. రానున్న రోజుల్లో ఈ మూవీ కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories